రైతుబంధు పంపిణీకి ఈసీ అనుమతి.. ప్రభుత్వం స్పందన
ఈ యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధును గతంలో లాగే తక్కువ భూ విస్తీర్ణం ఉన్న రైతులకు మొదటగా ఇచ్చే పద్ధతిలో పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తామని వ్యవసాయశాఖ తెలిపింది.
యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు ఆర్థిక సాయాన్ని అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేసుందుకు ఎన్నికల కమిషన్ అనుమతించడంపై హర్షం వ్యక్తం చేసింది రాష్ట్ర వ్యవసాయ శాఖ. ఏటా వానాకాలం సీజన్, యాసంగి సీజన్ ప్రారంభం అయిన వెంటనే రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు నిధుల విడుదల చేస్తున్నామని తెలిపింది.
ఈ యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధును గతంలో లాగే తక్కువ భూ విస్తీర్ణం ఉన్న రైతులకు మొదటగా ఇచ్చే పద్ధతిలో పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తామని వ్యవసాయశాఖ తెలిపింది. ఈనెల 25, 26, 27 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయని.. ఈనెల 29, 30 తేదీల్లో రైతుబంధు పంపిణీకి ఈసీ అనుమతించలేదని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.
ఈసీ ఆదేశాలకు అనుగుణంగా రైతుబంధు పెట్టుబడి సాయాన్ని రైతుల బ్యాంక్ ఖాతాల్లో DBT పద్ధతిలో జమ చేయడానికి నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపింది. దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,700 కోట్లు జమ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.