తెలంగాణ అవతరణ వేడుకలకు ఈసీ అనుమతి

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఈసారి మరింత ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఏర్పాటై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జరుగుతున్న వేడుకలివి.

Advertisement
Update:2024-05-24 17:58 IST

ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో, ఇటీవల తెలంగాణ కేబినెట్ మీటింగ్ పై కూడా ఈసీ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూన్-2న జరగాల్సిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు పరిమితులు ఉంటాయేమోనని అనుకున్నారంతా. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి షరతులు లేకుండా ఆవిర్భా వేడుకలు జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది.

పరేడ్ గ్రౌండ్ లో..

తెలంగాణ ఇచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న తొలి ఆవిర్భావ వేడుకలు ఇవి. జూన్-2న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్ కి వస్తారు. ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేయలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివిధశాఖల అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లపై ఆమె సమీక్ష చేపట్టారు.

 

సోనియా వస్తారా..?

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఈసారి మరింత ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఏర్పాటై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జరుగుతున్న వేడుకలివి. ఈ కార్యక్రమంలో సోనియాగాంధీ పాల్గొంటారని అంటున్నారు. ఇందుకోసం ముందుగానే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని సోనియా కృతజ్ఞత సభగా నిర్వహించాలని అనుకుంటున్నారు. 

Tags:    
Advertisement

Similar News