సీఎం రేవంత్ రెడ్డి మాటలు న‌మ్మి మోస‌పోవ‌ద్దు : హ‌రీశ్‌రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప‌రిచితుడు అని, ఇలాంటి నాయ‌కుల‌ను న‌మ్మి మోస‌పోవ‌ద్ద‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సూచించారు.

Advertisement
Update:2024-12-02 14:58 IST

మాట మార్చడంలో సీఎం రేవంత్‌రెడ్డి పీహెచ్‌డీ చేశారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ముఖ్యమంత్రి అపరిచితుడు అని ఆయన మాటలు నమ్మి మోసపోవద్దని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ఏడాది పాలన సీఎం రేవంత్ డబుల్ స్టాండర్డ్స్ పై తెలంగాణ భవన్ వేదికగా హరీష్ రావు వీడియో ప్రదర్శించారు. రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు ఆద‌ర్శంగా ఉండాలి. రాజ‌కీయ నాయ‌కుల‌ను ప్ర‌జ‌లు నిశితంగా ప‌రిశీలిస్తుంటారని హ‌రీశ్‌రావు అన్నారు. పొలిటికల్ లీడర్స్ ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని బాధ్య‌త‌గా మాట్లాడాలన్నారు.

రేవంత్ పాలనలో ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకమైందని పచ్చటి పొలాల్లో ఫార్మా చిచ్చు పెట్టొద్దని గిరిజన బిడ్డలు ఎదురుతిరిగితే, అర్ధరాత్రి లగచర్లను రణరంగంగా మార్చారు రాష్ట్రంలో ఏం జరిగినా ప్రతిపక్షాల కుట్ర అంటున్నారని మండిపడ్డారు. నక్సలైట్లు ఉంటే బాగుండేమో అని ముసలి కన్నీరు కార్చిన రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో మూడు బూటకపు ఎన్ కౌంటర్లు జరిగాయని ఆరోపించారు. టీడీపీలో ఉన్న‌ప్పుడు సోనియా గాంధీ బ‌లి దేవ‌త అని అన్న‌డు. ఇప్పుడేమో సోనియ‌మ్మ మా అమ్మ‌.. నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డ‌ల‌కు క‌న్న‌త‌ల్లి అని అంటుండు. పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డిన వారిని రాళ్ల‌తో కొట్టి చంపండి అని ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు అన్న‌డు.. ఇప్పుడేమో పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తున్నడని హారీశ్‌రావు తెలిపారు. తెలంగాణ ప్ర‌జ‌లు ఏం కోల్పోయార‌ని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.. రైతుబంధు, బ‌తుక‌మ్మ చీర‌లు, పెన్ష‌న్లు చాలా కోల్పోయారు

Tags:    
Advertisement

Similar News