యాదాద్రిలో 16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు

ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారి తెలిపారు

Advertisement
Update:2024-12-12 21:45 IST

 యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో ఈనెల 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. ప్రతిరోజు ఉదయం 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచి, ఉదయం 4 గంటల వరకు సుప్రభాతం, ఉదయం 4 నుంచి 5 వరకు తిరువారాధన, బాలభోగం,ఆరగింపు, ఉదయం 5.45 వరకు తిరుప్పావై సేవాకాలం, తీర్థ ప్రసాదాల గోష్టిని నిర్వహిస్తామన్నారు.

ఉదయం 5.45 నుంచి ఉదయం 6.45 నిమిషాల వరకు స్వామివారికి నిజాభిషేకం, ఉదయం 7.15 నిమిషాల వరకు సహస్రనామార్చన, ఉదయం 7.15 నిమిషాల నుంచి సర్వదర్శనాలు ఉంటాయని వివరించారు. ఉత్సవాల్లో భాగంగా రేపు(శుక్రవారం) రాత్రి 7 గంటలకు గోదా కల్యాణం, 14న ఉదయం 11.30 నిమిషాలకు ఓడి బియ్యం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News