పేదల ఇళ్లు కూల్చుతామంటే ఊరుకునేది లేదు : దానం నాగేందర్
పేదలు ఇళ్లు కుల్చుతా అంటే ఊరుకోనే ప్రసక్తే లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేది లేదని పేదలు ఇళ్లు కుల్చుతా అంటే ఊరుకోనే ప్రసక్తే లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని.. వచ్చాక స్పందిస్తానన్నారు. పోతే జైలుకు పోతా.. నాపై 173 కేసులు ఉన్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ఇంట్లో వైఎస్సార్, కేసీఆర్ ఫోటో ఉంది. ఇంట్లో లీడర్ల ఫోటోలు ఉంటే తప్పేంటి?. ఎవరి అభిమానం వాళ్లది’’ అంటూ దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.
గతంలో హైదరాబాద్ నగరంలో ఫుట్‌పాత్ కూల్చివేతలపై అధికారులు ఏకఫక్షంగా వవ్యహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పేద ప్రజల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఎలాంటి పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారన్నారు. అధికారులు చేసే పనుల వల్ల ప్రజల మధ్య మేము తిరగలేకపోతున్నామని ఎమ్మెల్యే దానం అన్నారు