కాంగ్రెస్ తో ఎంగేజ్ మెంట్.. తేల్చేసిన సీపీఐ నారాయణ

ఎన్నికల కోసమే గ్యాస్ ధర రూ.200 తగ్గించారని మండిపడ్డారు నారాయణ. మోదీకి చిత్తశుద్ధి ఉంటే ఆయన హయాంలో రూ.1200లకు పెరిగిన గ్యాస్ ధరను 2014లో ఉన్న ధర కంటే తక్కువకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement
Update:2023-08-30 16:30 IST

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలసి పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అయితే ప్రస్తుతం తమ రిలేషన్ ఎంగేజ్ మెంట్ స్టేజ్ లో ఉందని పెళ్లికి ఇంకా సమయం ఉందని చెప్పారు. కాంగ్రెస్ తో తాము కలిస్తే తమ విజయం ఖాయమంటున్నారు నారాయణ. ఓట్ల ప్రాతిపదికన కాకుండా ఒకరికి ఒకరు అవసరం అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు.

అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ మార్పుతో తెలంగాణలో బీజేపీ పనైపోయిందని అన్నారు నారాయణ. ఏపీలో కూడా తమకు బలం ఉందని, టీడీపీ, కమ్యూనిస్టులు కూటమిగా పోటీ చేస్తే ఏపీలో వైసీపీ సర్కార్‌ బ్రేక్ అవుతుందన్నారు. చంద్రబాబు 'ఇండియా' కూటమిలోకి రావాలని అన్నారు. అవినాష్ రెడ్డి జైలులో ఉండాల్సిన సందర్భంలో, జగన్ ఢిల్లీకి వచ్చి బీజేపీ పెద్దలను కలవగానే అంతా మారిపోయిందన్నారు.

ఎన్నికల కోసమే గ్యాస్ ధర రూ.200 తగ్గించారని మండిపడ్డారు నారాయణ. మోదీకి చిత్తశుద్ధి ఉంటే ఆయన హయాంలో రూ.1200లకు పెరిగిన గ్యాస్ ధరను 2014లో ఉన్న ధర కంటే తక్కువకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్యాస్ ధరల తగ్గింపు ఆపద మొక్కుల ప్రయత్నమేనని ఎద్దేవా చేశారు. వందే భారత్ రైలు స్పీడ్ కంటే వేగంగా దేశంలో మోదీ గ్రాఫ్ పడిపోతోందని చెప్పారు నారాయణ. అయితే విదేశాల్లో మోదీ గ్రాఫ్ పెరుగుతోందని, ఆయన అక్కడ పోటీ చేస్తే గెలుస్తారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

Tags:    
Advertisement

Similar News