బీఆర్‌ఎస్‌ది నిర్మాణం.. కాంగ్రెస్‌ది విధ్వంసం

రాత్రికి రాత్రే లక్ష డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? ప్రశ్నించి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

Advertisement
Update:2024-09-27 14:24 IST

తమ పార్టీ విధానం నిర్మాణం.. కాంగ్రెస్‌ది విధ్వంసమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. తాము నిర్మిస్తే. కాంగ్రెస్‌ కూల్చేస్తున్నది అన్నారు. హైడ్రా కూల్చివేతలు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లపై ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

'బీఆర్‌ఎస్‌ది నిర్మాణం.. కాంగ్రెస్‌ది విధ్వంసం. మా హయాంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టలేదని మభ్యపెట్టారు. మేం కట్టిన ఇళ్లనే మూసీ బాధితులకు కేటాయిస్తున్నారు. లక్ష ఇళ్లు రాత్రికి రాత్రే ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? మహా నగరంలో లక్ష డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను నిర్మించాం. కాంగ్రెస్‌ విష ప్రచారాలు అబద్ధాలు అనడానికి మరో సాక్షమిదే' అని కేటీఆర్‌ రాసుకొచ్చారు. 

Tags:    
Advertisement

Similar News