తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం 8 కమిటీలు వేసిన కాంగ్రెస్ పార్టీ

ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీకి దామోదర రాజనర్సింహను చైర్మన్‌గా నియమించారు. ఆయనతో కలిపి ఈ కమిటీలో 9 మంది సభ్యులు ఉన్నారు.

Advertisement
Update:2023-09-09 20:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం 8 కమిటీలను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ కోసం పార్టీని సన్నద్దం చేయడమే కాకుండా.. గెలిపించే బాధ్యతలను ఈ కమిటీలపై పెట్టింది. మొత్తం 8 కమిటీలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆమోదం తెలిపారు. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కమిటీల లిస్టును విడుదల చేశారు.

ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీకి దామోదర రాజనర్సింహను చైర్మన్‌గా నియమించారు. ఆయనతో కలిపి ఈ కమిటీలో 9 మంది సభ్యులు ఉన్నారు. ఇక మేనిఫెస్టో కమిటీకి దుద్దిళ్ల శ్రీదర్ బాబును చైర్మన్‌గా, గడ్డం ప్రసాద్‌ను వైస్ చైర్మన్‌గా నియమించారు. మేనిఫెస్టో కమిటీలో 24 మంది సభ్యులు ఉండగా.. పీసీసీ ప్రెసిడెంట్, సీఎల్పీ లీడర్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఆర్గనైజేషన్స్, ఐఎన్‌టీయూసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సెల్స్ బాధ్యులను ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమించారు.

ఏఐసీసీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీకి చైర్మన్‌గా బలరామ్ నాయక్‌ను నియమించారు. ఈ కమిటీలో మొత్తం 10 మంది సభ్యులు ఉన్నారు. ఇక పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా షబ్బీర్ అలీని, వైస్ చైర్మన్‌గా ఈ.అనిల్ కుమార్‌ను నియమించారు. వీరిద్దరితో కలిపి ఈ కమిటీలో 12 మంది సభ్యులు ఉన్నారు. చార్జ్‌షీట్ కమిటీకి చైర్మన్‌గా సంపత్ కుమార్, వైస్ చైర్మన్‌గా రాములు నాయక్‌ను నియమించారు. ఈ కమిటీలో మొత్తం 14 మంది సభ్యులు ఉన్నారు. వీరితో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధులందరూ ఈ కమిటీలో భాగస్వామ్యులు కానున్నారు.

కమ్యునికేషన్ కమిటీకి చైర్మన్‌గా జెట్టి కుసుమ్ కుమార్‌ను, వైస్‌ చైర్మన్‌గా మదన్ మోహన్ రావును నియమించారు. ఇందులో మొత్తం 9 మంది సభ్యులు ఉన్నారు. ట్రైనింగ్ కమిటీకి చైర్మన్‌గా పొన్నం ప్రభాకర్, కన్వీనర్‌గా పవన్ మల్లాదిని నియమించారు. వీరిద్దరితో కలిపి ఇందులో 17 మంది సభ్యులు ఉన్నారు. స్ట్రాటజీ కమిటీకి చైర్మన్‌గా ప్రేమ్ సాగర్ రావును నియమించారు. ఇందులో 13 మంది సభ్యులకు చోటు కల్పించారు. 


Tags:    
Advertisement

Similar News