ఆధిక్యాలలో మేజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్.. ముందస్తు సంబరాల్లో నేతలు

శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ.. అమరుల ఆశయాలు, 4 కోట్ల ప్రజల ఆకాంక్షలు ఫలించే సమయం ఆసన్నమైందని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

Advertisement
Update:2023-12-03 10:29 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం స్పష్టంగా కనపడుతోంది. ఈ ఆధిక్యాలను ఫైనల్ రిజల్ట్ గా తీర్మానించలేం కానీ.. కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం ఉత్సాహం కనపడుతోంది. 63 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం స్పష్టంగా తెలుస్తోంది. మేజిక్ ఫిగర్ 60 కావడంతో కాంగ్రెస్ ఒడ్డునపడిందని అంటున్నారు నాయకులు. ట్రెండ్స్ పాజిటివ్ గా ఉండటంతో.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రత్యేక ట్వీట్ పెట్టారు. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ.. అమరుల ఆశయాలు, 4కోట్ల ప్రజల ఆకాంక్షలు ఫలించే సమయం ఆసన్నమైందని ఆయన ట్వీట్ చేశారు.


ఖమ్మంలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందా..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 9 చోట్ల, ఒకచోట ఆ పార్టీ మద్దతుతో పోటీ చేసిన సీపీఐ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. ఖమ్మంను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నచోట్ల నేతల సంబరాలు మొదలయ్యాయి. అటు సోషల్ మీడియాలో కూడా కాంగ్రెస్ సానుభూతిపరులు వరుస ట్వీట్లతో హడావిడి చేస్తున్నారు.

ఇబ్రహీంపట్నం వ్యవహారంలో ఆర్ఐ సస్పెన్షన్..

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆర్డీవో కార్యాలయం వద్ద పోస్టల్ బ్యాలెట్ బాక్సుల సీల్ తీసిన ఘటనలో డిప్యూటీ తహశీల్దార్ ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఆర్వో, ఏఆర్వోకు నోటీసులు ఇచ్చారు. ఇబ్రహీంపట్నంలో పోస్టల్ ఓట్లకు సంబంధించి నిన్న రాత్రి ఫిర్యాదు వచ్చిందని, డిఈఓ వెళ్లి సమస్య పరిష్కరించారని అన్నారు సీఈఓ వికాస్ రాజ్. అభ్యర్థులకు పూర్తి వివరాలు వెల్లడించామని చెప్పారు. 


Tags:    
Advertisement

Similar News