పారిశ్రామిక ప్రగతితోనే ప్రపంచంతో పోటీ పడుతం

కలెక్టర్‌ పై దాడి చేయించినా వెనక్కి తగ్గం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Advertisement
Update:2024-11-13 17:16 IST

పారిశ్రామిక ప్రగతితోనే ప్రపంచంతో పోటీ పడగలమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం సెక్రటేరియట్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొడంగల్‌ ను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయించారని తెలిపారు. పరిశ్రమలు రావాలంటే భూసేకరణ తప్పనిసరి అన్నారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు అమాయక గిరిజనులను రెచ్చగొట్టి కలెక్టర్‌ పై దాడికి ఉసిగొల్పాయన్నారు. కలెక్టర్‌, అధికారులపై దాడితో సమస్యలు పరిష్కారం కావాని, చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలన్నారు. కలెక్టర్‌ పై దాడి చేసినంత మాత్రాన ఫార్మా ఇండస్ట్రీ ఏర్పాటు నుంచి వెనక్కి తగ్గబోమన్నారు. భూములు కోల్పోతున్న రైతుల బాధ తమకు తెలుసు అన్నారు. రైతుల బాధను తమ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని, భూములు కోల్పోతున్న వారికి మెరుగైన ప్యాకేజీ ఇవ్వడంతో పాటు ఉద్యోగాలు కల్పిస్తామని, ఇండ్లు కోల్పోతున్న వారికి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇస్తామన్నారు. కుట్రపూరితంగానే బీఆర్ఎస్‌ శ్రేణులు కలెక్టర్‌ పైకి దాడికి గిరిజనులను ఉసిగొల్పాయన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం బీఆర్‌ఎస్‌ కు ఇష్టం లేదా చెప్పాలన్నారు. ప్రాజెక్టుల కోసం బీఆర్‌ఎస్‌ భూసేకరణ చేస్తే కాంగ్రెస్‌ పార్టీ ఏనాడు కాదనలేదని తెలిపారు. ఉద్యమ సమయంలో రెచ్చగొట్టి అమాయకులు ప్రాణాలు కోల్పోయేలా చేశారని, ఇప్పుడు అలాగే రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News