గ్రూప్‌-1 అభ్యర్థులను మోసం చేస్తున్నసీఎం, టీజీపీఎస్సీ ఛైర్మన్‌

జీవో 29తో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నోట్లో మట్టికొడుతున్నారని దాసోజు ఆగ్రహం

Advertisement
Update:2024-10-20 19:30 IST

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ ధ్వజమెత్తారు. సీఎం, టీజీపీఎస్సీ ఛైర్మన్‌ మహేందర్‌రెడ్డి ఇద్దరూ గ్రూప్‌-1 అభ్యర్థులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 29తో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల్లో నోట్లో మట్టికొడుతున్నారని మండిపడ్డారు. బండి సంజయ్‌కి ఫోన్‌ చేసిన రేవంత్‌రెడ్డి గ్రూప్‌-1 అభ్యర్థులను ఎందుకు కలవరని ప్రశ్నించారు. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ ను రద్దు చేసి 60 ఉద్యోగాలు యాడ్‌ చేసి 563 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. రేవంత్‌, మహేందర్‌రెడ్డి కలిసి తప్పుడు జీవో తీసుకొచ్చారు. ఎవరి కోసం హడావుడి పరీక్షలు పెడుతున్నారు. ఎన్టీఆర్‌ కంటే రేవంత్‌ గొప్ప వ్యక్తి కాదు. ఇచ్చిన జీవో 24 గంటల్లో ఎన్టీఆర్‌ వెనక్కి తీసుకున్న విషయాన్ని దాసోజు గుర్తుచేశారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సుప్రీంకోర్టులో కొట్టివేయబడుతుందనని మేము విశ్వసిస్తున్నాం. ధర్మం నిలబడుతుందన్నారు. కాబట్టి ఆ తీర్పు వచ్చేలోపు జీవోను రద్దు చేసి గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. రెండు నెలలు ఆలస్యమైతే ముఖ్యమంత్రికి వచ్చే ఇబ్బంది ఏమిటి? రాష్ట్రంలో తుగ్గక్‌ పాలన పాలన నడుస్తున్నదని దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు.

Tags:    
Advertisement

Similar News