ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్.. మిగతా స్థానాల్లో అభ్యర్థులపై క్లారిటీ

సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీ వెళ్లడం ఇది 11వ సారి. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రులుగా చేసినవారేవరూ ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన దాఖలాలు లేవని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

Advertisement
Update:2024-03-13 12:08 IST

సీఎం రేవంత్‌ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. గడిచిన వారం రోజుల్లో ఆయన హస్తిన పర్యటనకు వెళ్లడం ఇది రెండో సారి. సీఎంతో పాటు కాంగ్రెస్‌ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో మెంబర్‌గా ఉన్న మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటన తర్వాత‌ తెలంగాణలో మిగిలిన 13 పార్లమెంట్‌ స్థానాల్లో అభ్యర్థులపై క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.

ఇప్పటివరకూ లోక్‌సభ అభ్యర్థులకు సంబంధించి రెండు జాబితాలు విడుదల చేసింది కాంగ్రెస్‌. మొదటి జాబితాలోనే తెలంగాణలోని మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, జహీరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక రెండో జాబితాలో తెలంగాణ నుంచి ఏ ఒక్కరిని అభ్యర్థిగా ప్రకటించలేదు. దీంతో మిగిలిన 13 స్థానాల్లో అభ్యర్థులు ఎవరనేది సస్పెన్స్‌గా మారింది.

సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీ వెళ్లడం ఇది 11వ సారి. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రులుగా చేసినవారేవరూ ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన దాఖలాలు లేవని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇందులో రెండు సార్లు ప్రధాని, కేంద్రమంత్రులను కలిసేందుకు వెళ్లగా.. మిగతా అన్ని పార్టీ పరమైన పర్యటనలేనని చెప్తున్నారు.

Tags:    
Advertisement

Similar News