రేపు సంక్షేమ హాస్టళ్ల తనిఖీ చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy will inspect welfare hostels tomorrow
రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల పరిస్థితులను అంచన వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, అధికారులు రేపు సంక్షేమ హాస్టళ్ల తనిఖీ చేపట్టనున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు గురుకుల, రెసిడెన్షియల్ హాస్టళ్లను శనివారం నాడు వ్యక్తిగతంగా సందర్శించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాల్లోని ఏదో ఒక సంక్షేమ హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించనున్నారు. తెలంగాణలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహాల్లో ఇటీవల వరుస ఘటనలు జరుగుతున్నాయి.
తెలంగాణ గురుకుల పాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మాారాయి. 8 నెలల్లో 36 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం, 500లకు పైగా మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం సంక్షేమ హాస్టళ్ళ అధ్వాన్న పరిస్థితికి అద్దం పడుతుంది. దుర్భరమైన పరిస్థితిలో పాములు, తేళ్ళు, విష పురుగులతో సావాసం చేస్తున్నారు పిల్లలు. పెద్దాపూర్ గురుకులంలో ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇద్దరు మృతి, మరో నలుగురు అస్వస్థతకు గురి కావడంతో పేరెంట్స్ భయాందోళన చెందుతూ పిల్లలను స్వగ్రామాలకు తీసుకెళ్ళారు.హాస్టల్ లో సీటు వచ్చిందంటే సంబరపడ్డాం.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో భయపడాల్సిన వస్తుందని విద్యార్థులతోపాటు పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు