గిరిజన యువతి డాక్టర్ కలకు సర్కారు అండ
సాయిశ్రద్ధకు చెక్కు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
డాక్టర్ కావాలన్న గిరిజన యువతి కలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. కుమ్రంభీం జిల్లా జైనూరు మండలం జెండాగూడాకు చెందిన సొయిశ్రద్ధ నీట్ లో మంచి ర్యాంకుతో ఎంబీబీఎస్ సీటు సాధించారు. మెడికల్ కాలేజీ ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆమె చదువుకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సాయిశ్రద్ధను జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి పిలిపించి ప్రభుత్వం తరపున ఫీజుకు అవసరమయ్యే మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఆమె ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు. తనకు అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డికి సాయిశ్రద్ధతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement