ఏపీలో నామినేడ్ పోస్టుల్లో 50శాతం రిజర్వేషన్ రద్దు

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

Advertisement
Update:2025-02-06 14:52 IST

ఏపీలో కూటమి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. నామినేడ్ పోస్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో చేసిన చట్టాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు దానిలోని లోటుపాట్లను సవరించేలా నూతన చట్టం తెచ్చే ప్రతిపాదనపై కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. దీంతో పాటు ఈఏపీ ప్రాజేక్టులు మినహా ఏపీ సీఅర్డీఏ చేపట్టే పనులకు టెండర్ల పరిమితి పెంపు కోసం నిబంధనల సవరణకు కేబినెట్‌లో ప్రతిపాదన పెట్టారు. టీటీడీలోని పోటులో పనిచేసే వర్కర్‌లను సూపర్ వైజర్‌లుగా అప్‌గ్రేడ్ చేస్తూ కేబినెట్‌లో చర్చ జరిగింది. వీరిని సీనియర్ అసిస్టెంట్ కేడర్‌కు పదోన్నతి కల్పించే ప్రతిపాదన వచ్చింది.

గతంలో టీడీపీ అధికారంలో ఉండగా చేపట్టిన నీరు-చెట్టు పనులకు సంబంధించి ఇంకా పెండింగ్‌లో ఉన్న బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద నిర్మించే ఇళ్లకు కొత్త టెండర్లు పిలిచే అంశంపై చర్చ జరిగింది. టీటీడీలో పోటు కార్మికులకు సంబంధించిన 15 పోస్టులను సూపర్‌వైజర్‌ స్థాయికి పెంచేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి జిల్లా తమ్మినపట్నం, కొత్తపట్నంలో చెన్నై-బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి పరిహారం కింద ఎకరాకు రూ.8లక్షలు చొప్పున దాదాపు రూ.79కోట్లు చెల్లించేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం.

మద్యం ధరలపై క్యాబినెట్‌లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తిరుపతి జిల్లాలోని చెన్నై-బెంగుళూరు పారిశ్రామిక కారిడార్‌‌లో భూములు కోల్పోయిన వారికి పరిహారంగా ఎకరానికి 8 లక్షల చొప్పున పరీహారం ఇచ్చేందుకు కేబినెట్‌లో ప్రతిపాదన వచ్చింది. అలాగే, తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామం,కోట మండలం లోని కొత్తపట్నం గ్రామ పరిధిలో పరిహారం పెంపు ప్రతిపాదన చేశారు. భారత్‌లో తయారైన విదేశీ మద్యం,బీర్,ఎఫ్ ఎల్ స్పిరిట్‌లపై అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్ సవరణకు మంత్రి వర్గం ప్రతిపాదన తెచ్చినట్లు తెలిసింది.

Tags:    
Advertisement

Similar News