సాయంత్రం ఢిల్లీకి సీఎం
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, హైకమాండ్ కీలక నేతలతో సమావేశం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎల్పీ భేటీ తర్వాత హస్తినకు పయనం కానున్న సీఎం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, హైకమాండ్ కీలక నేతలతో సమావేశం కానున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నారు. కులగణన, సామాజికవర్గాల వారీగా కలిగే ప్రయోజనాలు, చట్టబద్ధత కోసం తీసుకుంటున్న చర్యలను సీఎం బృందం పార్టీ పెద్దలకు తెలియజేయనున్నది. అలాగే సీఎల్పీ భేటీ వివరాలు, పార్టీలో ఎమ్మెల్యేల అసంతృప్తి, పార్టీ అధికారిక హ్యాండిల్‌లో పోల్, ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయం సుప్రీంకోర్టులో కేసు వంటి అంశాలపై హైకమాండ్ ఆరా తీయనున్నట్టు తెలుస్తోంది. పీసీసీ కార్యవర్గం కూర్పు, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలను చర్చించనున్నట్లు సమాచారం. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ కడా వెళ్లే అవకాశం ఉన్నది. రేపు సాయంత్రం లేదా ఎల్లుండి రేవంత్ రెడ్డి బృందం తిరిగి హైదరాబాద్ వస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.