ఇందిరా గాంధీకి నివాళులర్పించిన సీఎం రేవంత్..కాంగ్రెస్ నేతలు
ఇవాళ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ వీహెచ్‌తో కలిసి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి మంత్రి పొన్నం పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వారి చిత్రపటాలకు నివాళులర్పించారు.ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని సీఎం రేవంత్ తెలిపారు. ఆమెను అనుసరిస్తూ పీవీ నరసింహారావు భూ సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ మంచి స్నేహితులన్నారు. గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సీనియర్ నేత వి.హనుమంతరావుతో కలిసి వారి చిత్రపటాలకు నివాళులర్పించారు.
ఇందిరమ్మ లాంటి నాయకురాలు ఆమె ఇచ్చిన స్ఫూర్తి ఈ దేశ యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. గురువారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ వీహెచ్‌తో కలిసి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో అనేక సంస్కరణలు చేసి ప్రజాహిత నిర్ణయాలు తీసుకొని ఈ దేశ ప్రజలకు అమ్మగా ఇందిరా గాంధీ చిరస్మరణీయం అని పేర్కొన్నారు. నేటికి కూడా అన్ని ప్రభుత్వాలు ఇందిరమ్మ పాలన తేవాలని ఆదర్శంగా తీసుకుని చిరస్థాయిగా నిలిచారని ఆయన అన్నారు.