రోడ్డు మార్గాన ఏటూరు నాగారం, భద్రాచలం బయలుదేరిన కేసీఆర్

తెలంగాణలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరద‌ ప్రాంతాల్లో ప్రజలను ఆదుకోవడానికి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు.;

Advertisement
Update:2022-07-17 09:47 IST
రోడ్డు మార్గాన ఏటూరు నాగారం, భద్రాచలం బయలుదేరిన కేసీఆర్
  • whatsapp icon

తెలంగాణలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరద‌ ప్రాంతాల్లో ప్రజలను ఆదుకోవడానికి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారు. గోదావరి ప‌రివాహ‌క‌ ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. హెలికాప్టర్‌లో ఏరియల్‌ సర్వే చేయాలని అనుకున్నప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆయన రోడ్డు మార్గానే బయలు దేరారు.

ఈ రోజు ఉదయమే హన్మకొండ నుంచి ఏటూరు నాగారం కు రోడ్డు మార్గంలో బయలుదేరారు కేసీఆర్. గూడెపహడ్‌, ములుగు, గోవిందరావుపేట మీదుగా ఆయన ఏటూరునాగారం చేరుకుంటారు. దాదాపు 4 గంటలకు పైగానే వరద ప్రభావిత ప్రాంతాలను కేసీఆర్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. జరిగిన నష్టాన్ని స్థానికులను అడిగి తెలుసుకుంటారు.

అక్కడి నుంచి ఆయన భద్రాచలం వెళ్తారు.. భారీ వాన పడుతున్నప్పటికీ ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో కేసీఆర్ పరిశీలిస్తూ పర్యటన సాగిస్తున్నారు. భద్రాచలంలో వరద పరిస్థితిని ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. సీఎం కేసీఆర్‌ వెంట సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News