రేపు సీఎల్పీ మీటింగ్.. రేపే సీఎం సెలక్షన్

కాంగ్రెస్‌ నేతల బృందం గవర్నర్‌ తమిళిసైని కలిసింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ లేఖ అందజేశారు నేతలు. సోమవారం శాసనసభాపక్ష సమావేశం నిర్వహించుకుంటామని, ఆ తర్వాత సీఎల్పీ నేత పేరును నివేదిస్తామని చెప్పారు.

Advertisement
Update:2023-12-03 22:14 IST

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ పార్టీ ముందున్న అతిపెద్ద సవాలు సీఎం ఎంపిక. కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి ఎవరనేదే అసలు ప్రశ్న. దీనికి రేపు సమాధానం దొరికే అవకాశముంది. రేపు ఉదయం 9.30గంటలకు కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సీఎల్పీ) మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లోనే సీఎం ఎవరనేది ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు. ఎమ్మెల్యేలు ఎంపిక చేసుకుంటారు అనడంకంటే.. అధిష్టానం సూచిస్తుంది, ఎమ్మెల్యేలు జై కొడతారు అనడం కరెక్ట్. సీఎం ఎవరు అనే విషయంపై అధిష్టానం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

కాంగ్రెస్‌ నేతల బృందం గవర్నర్‌ తమిళిసైని కలిసింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ లేఖ అందజేశారు నేతలు. సోమవారం శాసనసభాపక్ష సమావేశం నిర్వహించుకుంటామని, ఆ తర్వాత సీఎల్పీ నేత పేరును నివేదిస్తామని చెప్పారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్‌ రావ్‌ ఠాక్రే, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, మల్లు రవి తదితరులు గవర్నర్ ని కలిశారు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది.

గవర్నర్ ని కలిసే ముందుగా ఎమ్మెల్యేలంతా గచ్చిబౌలిలోని హోటల్‌ ఎల్లాలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అధిష్టానం సూచనతో డీకే శివకుమార్ ఈ మీటింగ్ పెట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కర్నాటక తరలిస్తారనే వార్తలు వినిపించినా.. అలాంటిదేమీ లేదని తేలిపోయింది. సీఎం ఎవరనేది రేపు సీఎల్పీ మీటింగ్ లో తేలుతుందన్నారు డీకే శివకుమార్. 

Tags:    
Advertisement

Similar News