గరికపాటి వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి

చిరంజీవిపై గరికపాటి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. చిరు ఫ్యాన్స్, ఆర్జీవీ లాంటి వాళ్ళు కూడా గరికపాటిపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు చిరంజీవి, గరికపాటి వ్యాఖ్యలపై స్పందించారు.

Advertisement
Update:2022-10-13 17:21 IST

నటుడు చిరంజీవి పై గరికపాటి నర్సింహారావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే దశరా రోజు హర్యణా గవర్నర్ దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారాయన.

ఆ కార్యక్రమంలో గరికపాటి ప్రసంగం మొదలుపెట్టే సమయంలో చిరంజీవి ఫ్యాన్స్ తో సెల్ఫీలు తీసుకుంటున్నారు. అది చూసి ఆగ్రహించిన గరికపాటి. చిరంజీవి సెల్ఫీలు ఆపేసి వేదికపైకి వచ్చి కూర్చుంటే తప్ప తాను మాట్లాడనని, లేదంటే వెళ్ళిపోతానని అన్నారు. దాంతో చిరంజీవి వెంటనే సెల్ఫీలు ఆపేసి వచ్చేశారు. అప్పటి నుంచి చిరు అభిమానులు గరికపాటిని ట్రోల్స్ చేస్తున్నారు.

గరికపాటికి అంత‌ అహంకారం పనికి రాదని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దర్శకుడు రాం గోపాల్ వర్మ అయితే ఇక గరికపాటిపై వరస ట్వీట్లతో దాడే మొదలు పెట్టారు. గతంలో గరిక పాటి స్త్రీల గురించి చేసిన‌ వివాదాస్పద వ్యాఖ్యల వీడియోల‌ను పోస్ట్ చేసి ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ రోజు చిరంజీవి ఓ మీడియా సమావేశంలో స్పందించారు. గరికపాటి పెద్దాయన అని, గొప్ప వ్యక్తి అని, ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు చిరంజీవి. గాడ్ ఫాద‌ర్ మూవీ సక్సెస్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేసి వివాదానికి ముగింపు పలికారు కానీ ఫ్యాన్స్ , ఆర్జీవీ లాంటి వాళ్ళు ముగింపు పలుకుతారా అనేది వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News