ఆత్రం సక్కు, రాగిడికి ఛాన్స్‌.. మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

2018 ఎన్నికల్లో ఆసిఫాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన ఆత్రం సక్కు తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ టికెట్ ఆత్రం సక్కును కాదని కోవా లక్ష్మికి ఇచ్చారు.

Advertisement
Update:2024-03-14 23:40 IST

లోక్‌సభ ఎన్నికల కోసం మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. ఆదిలాబాద్‌తో పాటు మల్కాజ్‌గిరి స్థానానికి అభ్యర్థులను ఖరారు చేశారు. గతంలో హామీ ఇచ్చిన మేరకు ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కును ఫైనల్ చేశారు గులాబీ బాస్.

2018 ఎన్నికల్లో ఆసిఫాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన ఆత్రం సక్కు తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ టికెట్ ఆత్రం సక్కును కాదని కోవా లక్ష్మికి ఇచ్చారు. ఈ సమయంలోనే ఎంపీ టికెట్ ఇస్తామని ఆత్రం సక్కుకు హామీ ఇచ్చారు కేసీఆర్‌.


ఇక మల్కాజ్‌గిరి స్థానం నుంచి అనూహ్యంగా రాగిడి లక్ష్మారెడ్డి పేరును ప్రకటించారు కేసీఆర్. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్‌ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన రాగిడి లక్ష్మారెడ్డి.. టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్‌లో చేరారు. మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి పోటీకి విముఖత వ్యక్తం చేయడంతో రాగిడి లక్ష్మారెడ్డి పేరును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు శంభీపూర్ రాజు పేరు కూడా వినిపించింది.

ఇప్పటివరకూ మొత్తం బీఆర్ఎస్‌ 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. నల్గొండ, భువనగిరి, నాగర్‌కర్నూలు, మెదక్, హైదరాబాద్, సికింద్రాబాద్‌ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. నాగర్‌కర్నూలు స్థానం పొత్తులో భాగంగా బీఎస్పీకి కేటాయిస్తారని తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News