ఆ వార్తలు ఆందోళనకరం.. అండగా నిలవండి - కేటీఆర్

స్వయంగా కేటీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల.. వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు. అయితే సోమవారం నుంచి సిరిసిల్లలోని పాలిస్టర్ వస్త్ర పరిశ్రమను మూసివేయాలని.. పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ యజమానులు నిర్ణయం తీసుకున్నారు.

Advertisement
Update:2024-01-16 12:05 IST

సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమలు మూతపడుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగించాలని రేవంత్ సర్కార్‌కు విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికులకు అండగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

గడిచిన పదేళ్లలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందిందని, మరింతగా విస్తరించిందని చెప్పారు. అయితే వస్త్ర పరిశ్రమ మళ్లీ సంక్షోభంలోకి వెళ్తుందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు కేటీఆర్. తమిళనాడులోని తిరుపూర్‌తో పోటీ పడేలా వస్త్ర పరిశ్రమను మరింతగా బలోపేతం చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కోరారు కేటీఆర్.


స్వయంగా కేటీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల.. వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు. అయితే సోమవారం నుంచి సిరిసిల్లలోని పాలిస్టర్ వస్త్ర పరిశ్రమను మూసివేయాలని.. పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ యజమానులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో వేలాది కార్మికుల ఉపాధిపై ఎఫెక్ట్ పడనుంది. దేశవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమలో సంక్షోభం, కొత్త ఆర్డర్లు లేకపోవడంతో పరిశ్రమను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఇప్పటికే స్పందించారు. వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Tags:    
Advertisement

Similar News