మేం ఎవ్వ‌నికి బీ టీమ్‌ కాదు.. తెలంగాణ ప్రజల టీమ్‌

బీఆర్ఎస్‌ ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని భావిస్తే, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు అందితేనే ఓటు వేయాలని ప్రజలను కోరారు మంత్రి కేటీఆర్‌.

Advertisement
Update:2023-10-05 15:46 IST

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటనలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో పర్యటించిన కేటీఆర్‌.. కాంగ్రెస్‌, బీజేపీల విమర్శలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. షాద్ నగర్ ప్రగతి నివేదన సభలో ప్ర‌సంగించారు. కాంగ్రెస్‌ ఆరోపిస్తున్నట్లు తాము బీజేపీ టీం కాదని.. బీజేపీ ఆరోపిస్తున్నట్లు తాము కాంగ్రెస్‌ బీ టీం కాదన్నారు. తెలంగాణ ప్రజల అండ ఉన్నంత వరకు వారి టీంగానే ఉంటామన్నారు.

ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిపై డైరెక్ట్ అటాక్ చేశారు కేటీఆర్. రేవంత్ రెడ్డి RSS మనిషేనని కాంగ్రెస్‌ నేతలే చెప్పారన్నారు కేటీఆర్‌. RSS మనిషిని పీసీసీ చీఫ్‌గా ఎలా నియమిస్తారనంటూ పంజాబ్ మాజీ సీఎం అమరేందర్ సింగ్‌ సోనియాకు లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. అధికారం ఇచ్చినప్పుడు ఏమీ చేయని కాంగ్రెస్‌.. నేడు అలవికానీ హామీలు ఇస్తోందన్నారు. ఓటేస్తే షాద్‌నగర్‌కు చందమామ‌ను తీసుకొస్తా అనే విధంగా కాంగ్రెస్‌ నేతల హామీలు ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్‌ ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయాలని ప్రజలను కోరారు మంత్రి కేటీఆర్‌. రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు అందితేనే ఓటేయండని సూచించారు. 9 ఏళ్ల పాలనలో ఎన్నో మంచి పనులు చేసుకున్నామని, షాద్‌ నగర్‌కు కృష్ణా నీళ్లను తెచ్చేది కూడా కేసీఆరేనని చెప్పారు. ఐదు రిజర్వాయర్లు తయారవుతున్నాయన్నారు. కాంగ్రెస్‌ నేతలు కడుపులో గుద్ది.. నోట్లో పిప్పరమెంట్‌ పెట్టే రకమంటూ సెటైర్లు వేశారు.

Tags:    
Advertisement

Similar News