నాగర్‌కర్నూలు ఎంపీ.. RS ప్రవీణ్‌కుమార్‌కు BRS మద్దతు..?
RS ప్రవీణ్‌కుమార్ BRSలో చేరబోతున్నారంటూ కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రచారం చేశాయి. దీంతో ఈ విషయంపై ఆయన ట్విట్టర్‌లో క్లారిటీ ఇచ్చారు.
నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానంపై సోషల్‌మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. నాగర్‌కర్నూలు సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఈ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది.
ఈ నేపథ్యంలోనే సోషల్‌మీడియాలో పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. బీఎస్పీ స్టేట్ చీఫ్ RS ప్రవీణ్‌కుమార్ నాగర్‌కర్నూలు నుంచి పోటీ చేస్తారని, ఆయనకు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రెండు పార్టీల నేతల మధ్య చర్చలు కూడా మొదలయ్యాయంటూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా, దీనిపై ఒకటి, రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.
మరోవైపు RS ప్రవీణ్‌కుమార్ BRSలో చేరబోతున్నారంటూ కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రచారం చేశాయి. దీంతో ఈ విషయంపై ఆయన ట్విట్టర్‌లో క్లారిటీ ఇచ్చారు. తన రాజకీయ ప్రస్థానంపై వస్తున్న వదంతులను నమ్మొద్దని సూచించారు. చివరి శ్వాస వరకు సామాజికన్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం దిశ వైపే నా ప్రయాణం అంటూ ట్వీట్ చేశారు.
నాగర్‌కర్నూలు ఎంపీ అభ్యర్థిని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఇటీవల పార్టీలో చేరిన పోతుగంటి రాములు కుమారుడు భరత్‌యాదవ్‌ను పోటీలో నిలిపింది. ఇక కాంగ్రెస్ నుంచి మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పోటీ పడుతున్నారు.