మళ్లీ జగనే గెలుస్తున్నాడు- కేసీఆర్

తమకు వస్తున్న సమాచారం ప్రకారం మాత్రం సీఎం జగనే మళ్లీ గెలుస్తార‌న్నారు కేసీఆర్. ఎవరు గెలిచినా తమకు బాధలేదన్నారు.

Advertisement
Update:2024-04-23 23:42 IST

ఏపీలో మళ్లీ వైసీపీదే అధికారం అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తమకు వస్తున్న సమాచారం మేరకు జగనే మళ్లీ గెలవబోతున్నారని చెప్పారు. టీవీ-9 లైవ్‌ డిబెట్‌లో పాల్గొన్న కేసీఆర్‌ ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర సమాధానం ఇచ్చారు. "మీ పాతమిత్రుడు చంద్రబాబు గెలవాలా?, యువకుడు, మీ సన్నిహితుడు జగన్ గెలవాలా?. మీ పరిశీలనేంటి, మీ కోరిక ఏంటి" అన్న ప్రశ్నకు.. కేసీఆర్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పారు. ఏపీలో ఏం జరిగినా తమకు పట్టింపు లేదన్నారు. ఎవరి అదృష్టం బాగుంటే వారు గెలుస్తారన్నారు.

తమకు వస్తున్న సమాచారం ప్రకారం మాత్రం సీఎం జగనే మళ్లీ గెలుస్తార‌న్నారు కేసీఆర్. ఎవరు గెలిచినా తమకు బాధలేదన్నారు. "మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, తెలంగాణ పాయింట్ ఆఫ్‌ వ్యూలో ఎవరు గెలిస్తే బాగుంటుంది" అన్న ప్రశ్నకు చాలా హుందాగా బదులిచ్చారు కేసీఆర్. ఇలాంటి సందర్భంలో ఒక రాజకీయ నాయకుడిగా తాను చెప్పడం, ఒకపార్టీకి వత్తాసు పలకడం కరెక్ట్ కాదన్నారు. వాళ్ల రాష్ట్రం, వాళ్ల రాజకీయాలు వాళ్లు చేసుకుంటారన్నారు. తనకు అందిన సమాచారం మేరకైతే జగన్ మళ్లీ గెలుస్తాడని చెప్పానన్నారు.

ఏపీలో బీఆర్ఎస్‌ పార్టీ పరిస్థితిపైనా స్పందించారు కేసీఆర్.

ఈ ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్‌ జోక్యం ఉండబోదన్నారు. కానీ, భవిష్యత్తులో మాత్రం పోటీ చేయొచ్చన్నారు. మొత్తానికి ఏపీలో మరోసారి జగన్‌దే అధికారం అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఓవైపు సర్వేలన్నీ వరుసబెట్టి జగన్‌కే పట్టం కడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ కూడా జగన్‌దే అధికారం అనడంతో కూటమి గుండెల్లో బండరాయి పడ్డట్టయింది.

Tags:    
Advertisement

Similar News