బీజేపీ-జనసేన మధ్య పొత్తు చిచ్చు మొదలైందా..?

రెండు పార్టీల పోటీ జాబితాలో పై రెండు నియోజకవర్గాలు చాలా కీలకంగా ఉన్నాయి. ఇప్పుడిదే విషయం రెండుపార్టీల మధ్య చిచ్చుకు కారణమవుతోంది.

Advertisement
Update:2023-10-30 13:45 IST

తెలంగాణలో బీజేపీ-జనసేన మధ్య పొత్తు చిచ్చు మొదలైంది. నిజానికి పొత్తు పెట్టుకోవటం రెండు పార్టీల‌కూ ఇష్టంలేదు. పొత్తు పెట్టుకోవటంలో రెండుపార్టీల్లోనూ ఎవరి హిడెన్ అజెండా వాళ్ళకుంది. అందుకనే మనసులు కలవకపోయినా రెండుపార్టీలు కలిశాయి కాబట్టే గొడవలు మొదలైపోయాయి. ఇంతకీ విషయం ఏమిటంటే.. కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ జనసేనకు కేటాయించేది లేదని బీజేపీ నేతలు, క్యాడర్ పార్టీ ఆఫీసులో రచ్చ రచ్చ చేశారు.

శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో పోటీచేసే విషయంలో రెండు పార్టీలు బాగా పట్టుబడుతున్నాయి. పై నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు బీజేపీ నేతలు ఐదేళ్ళుగా గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. సీమాంధ్రలు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తాము ఈజీగా గెలిచిపోతామని బీజేపీ నేతలు అనుకుంటున్నారు. అందుకనే పోటీకి రెడీ అయిపోయారు. సరిగ్గా ఇలాంటి సమయంలో బీజేపీకి జనసేనతో పొత్తు కుదిరింది. జనసేన ఒంటరిగా 32 నియోజకవర్గాల్లో పోటీచేయాలని గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ నియోజకవర్గాల్లో కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి కూడా ఉన్నాయి.

అంటే రెండు పార్టీల పోటీ జాబితాలో పై రెండు నియోజకవర్గాలు చాలా కీలకంగా ఉన్నాయి. ఇప్పుడిదే విషయం రెండుపార్టీల మధ్య చిచ్చుకు కారణమవుతోంది. కూకట్ పల్లిని జనసేనకు కేటాయించేది లేదని నియోజకవర్గంలోని నేతలు, క్యాడర్ పార్టీ ఆఫీసుకు వచ్చి పెద్ద గోల చేశారు. ఇదే విధంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం నేతలు, క్యాడర్ కూడా ఇలాంటి డిమాండుతోనే ఆదివారం పార్టీ ఆఫీసులో హల్ చల్ చేశారు. తమ డిమాండ్లను కాదని రెండు సీట్లను జనసేనకు కేటాయిస్తే కచ్చితంగా ఓడగొడతామని కూడా నేతలు పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో తెగేసి చెబుతున్నారు.

ఇదే సమయంలో పై రెండు సీట్లలో పోటీచేయాల్సిందే అని జనసేన నేతలు కూడా చాలా గట్టిగా డిసైడ్ అయ్యారు. బీజేపీ ఎంత ఒత్తిడితెచ్చిన రెండు నియోజకవర్గాలను వదులుకోకూడదని పార్టీలో తీర్మానించారు. శేరిలింగంపల్లి సీటు బీజేపీకే ఉండాలనే విషయంలో సీనియర్ నేతలు కొండా విశ్వేశ్వరరెడ్డి, ధర్మపురి అర్వింద్ కూడా ఎంటరయ్యారు. ఎందుకంటే చేవెళ్ళ ఎంపీగా కొండా పోటీచేయాలని అనుకుంటున్నారు. చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి శేరిలింగంపల్లి అసెంబ్లీ సీటు కూడా వస్తుంది. అందుకనే కొండా చాలా పట్టుదలగా ఉన్నారు. కొండాకు మద్దతుగా అర్వింద్ నిలబడ్డారు. మరి పై రెండు నియోజకవర్గాల వ్యవహరం ఎలా పరిష్కారమవుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News