బాబుమోహన్‌కు షాకిచ్చిన కొడుకు..!
మొదట ఆందోల్ బీజేపీ టికెట్ ఉదయ్‌బాబుకే ఇస్తారన్న ప్రచారం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన బాబుమోహన్.. తండ్రి కొడుకుల మధ్య గొడవలు సృష్టిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
ఆందోల్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాబుమోహన్‌కు షాకిచ్చారు ఆయన తనయుడు ఉదయ్‌బాబు. మంత్రి హరీష్ రావు సమక్షంలో ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఉదయ్‌బాబుతో పాటు ఆందోల్, జోగిపేట, చౌటుకూర్ మండలాలకు చెందిన పలువురు బీజేపీ నాయకులు కారు పార్టీలో చేరారు.
మొదట ఆందోల్ బీజేపీ టికెట్ ఉదయ్‌బాబుకే ఇస్తారన్న ప్రచారం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన బాబుమోహన్.. తండ్రి కొడుకుల మధ్య గొడవలు సృష్టిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఈసారి బీజేపీ టికెట్ ఇవ్వకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ వైరాగ్యం ప్రదర్శించారు. ఇక రాజకీయాల కారణంగా కొంత కాలంగా తండ్రి కొడుకుల మధ్య విబేధాలు మొదలయ్యాయి. ఈసారి తను పోటీ చేయాలని ఉదయ్‌బాబు భావించారు.
అయితే చివరకు ఆందోల్ టికెట్ బాబుమోహన్‌కే ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. దీంతో మనస్తాపం చెందిన ఉదయ్‌బాబు బీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పుడు ఆందోల్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బాబుమోహన్‌కు టికెట్ నిరాకరించిన బీఆర్ఎస్ అధిష్టానం చంటి క్రాంతి కిరణ్‌కు అవకాశమిచ్చింది. దీంతో బాబుమోహన్ బీజేపీలో చేరారు. ప్రస్తుతం చంటి క్రాంతి కిరణ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉండగా.. దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.