కేసీఆర్ నాటిన మొక్కకు పుట్టినరోజు వేడుక

హరితహారంలో భాగంగా సీఎం కేసీఆర్ చాలా చోట్ల మొక్కలు నాటారు. అయితే ఆ కార్యక్రమం ప్రారంభ సందర్భంగా 2015లో ఆయన చేతులమీదుగా నాటిన మొక్కని ఇప్పటికీ అపురూపంగా చూసుకుంటున్నారు.

Advertisement
Update:2023-07-06 13:54 IST

ఎనిమిదేళ్ల క్రితం కేసీఆర్ నాటిన మొక్క ఇప్పుడు వృక్షంగా మారింది. ఆనాడు ఆయన తలపెట్టిన హరితహారం నేడు దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఆ మొక్కకు ప్రతి ఏటా పుట్టినరోజు జరుపుకుంటూ హరితహారం స్ఫూర్తిని చాటుతుంటారు. ఈ ఏడాది కూడా చెట్టుగా మారిన ఆ మొక్క పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగింది.

ఆ మొక్క ఎక్కడుందంటే..?

హరితహారం తొలిదశ ప్రారంభోత్సవం సందర్భంగా 2015 జులై 6న సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా వేల్పూరులో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి ఆవరణలో మొక్కను నాటారు. ప్రతి ఏటా ఆ మొక్కకు మంత్రి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరుగుతాయి. ఈ ఏడాది కూడా వేల్పూరులో మంత్రి ఆ మొక్కకు పుట్టినరోజు వేడుకలు జరిపారు. బెలూన్లు కట్టి దాని ముందు కేక్ కట్ చేశారు.

ప్రపంచం మొత్తం అడవుల శాతం తగ్గిపోతుంటే తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం వల్ల 7.7 శాతం అడవులు పెరిగాయని గుర్తు చేశారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. మొక్కలు నాటి సంరక్షించడం మన అందరి బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో అగ్రపథంలో దూసుకెళ్లున్న తెలంగాణ రాష్ట్రం పచ్చదనంలోనూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సీఎం కేసీఆర్‌ దార్శనికతతో చేపట్టిన హరితహారం కార్యక్రమం పుడమి తల్లికి పచ్చని కోకను బహమతిగా అందించినట్లయిందన్నారు. హరితహారంలో భాగంగా సీఎం కేసీఆర్ చాలా చోట్ల మొక్కలు నాటారు. అయితే ఆ కార్యక్రమం ప్రారంభ సందర్భంగా 2015లో ఆయన చేతులమీదుగా నాటిన మొక్కని తాము అపురూపంగా చూసుకుంటున్నట్టు తెలిపారు మంత్రి. 

Tags:    
Advertisement

Similar News