గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు మరో షాక్‌.. కాంగ్రెస్‌లోకి ప్రకాష్‌ గౌడ్‌

గతంలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ప్రకాష్‌ గౌడ్‌. ఆ టైంలోనే ప్రకాష్‌ గౌడ్‌ బీఆర్ఎస్‌ను వీడడం ఖాయమంటూ ప్రచారం జరిగింది. ఐతే కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని బీఆర్ఎస్‌ను వీడబోనని చెప్పుకొచ్చారు

Advertisement
Update:2024-04-19 12:11 IST
గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు మరో షాక్‌.. కాంగ్రెస్‌లోకి ప్రకాష్‌ గౌడ్‌
  • whatsapp icon

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో ఎమ్మెల్యే బీఆర్ఎస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రకాష్‌ గౌడ్‌.. రేపు హస్తం పార్టీ కండువా కప్పుకోనున్నారు.

ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. స్టేషన్‌ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కారు దిగి కాంగ్రెస్‌లో చేరిపోయారు.

గతంలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ప్రకాష్‌ గౌడ్‌. ఆ టైంలోనే ప్రకాష్‌ గౌడ్‌ బీఆర్ఎస్‌ను వీడడం ఖాయమంటూ ప్రచారం జరిగింది. ఐతే కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని బీఆర్ఎస్‌ను వీడబోనని చెప్పుకొచ్చారు ప్రకాష్‌ గౌడ్. 2009లో రాజేంద్రనగర్‌ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ప్రకాష్‌ గౌడ్‌. రెండు సార్లు తెలుగుదేశం పార్టీ టికెట్‌పై, రెండు సార్లు బీఆర్ఎస్ టికెట్‌పై విజయం సాధించారు.

Tags:    
Advertisement

Similar News