అస్సాంలో బీఫ్‌ బ్యాన్

అస్సాంలో గొడ్డు మాంసం పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు.

Advertisement
Update:2024-12-04 20:42 IST

అస్సాంలో బీఫ్‌పై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హింత బిశ్వశర్మ ప్రకటించారు. రెస్టారెంట్లు, ఫంక్షన్లు, బహిరంగ ప్రదేశాలలో అన్ని మతాల వారు బీఫ్ తినడాన్ని బ్యాన్ చేస్తున్నామని గొడ్డు మాంసం బ్యాన్ చేస్తున్నామని తెలిపారు. ఇటీవలే అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా సమగురి నియోజకవర్గంలోని ముస్లిం ఏరియాల్లో బీఫ్ ను బీజేపీ పంపిణీ చేసిందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై ఆయన ఘాటుగా స్పందించారు. బీఫ్ పై బ్యాన్ విధించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ లేఖ రాస్తే.. తాను ఆ దిశగా ప్రభుత్వపరమైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమేనని సీఎం హిమంత ప్రకటించారు. ఇది వరకు ఆలయాల దగ్గర నిషేదం విధించామని.. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం రాష్ట్రం మొత్తం వర్తిస్తుందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతించాలని లేదంటే పాకిస్తాన్ వెళ్లిపోవాలని మంత్రి పిజుష్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది.

Tags:    
Advertisement

Similar News