హెచ్‌సీఏ ఎన్నికల్లో ఓటు వేయకుండా 57 క్లబ్స్‌పై నిషేధం

సభ్యుల భార్య, పిల్లలు, అతడి బంధువులు లేదా భార్య తరపు బంధువులు క్లబ్స్‌ను నిర్వహిస్తున్నారు. ఇలాంటి 57 క్లబ్స్‌పై ఓటు వేయకుండా నిషేధం విధించారు.

Advertisement
Update:2023-08-01 09:31 IST

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికల్లో ఓటు వేయకుండా 57 క్లబ్స్‌పై సుప్రీంకోర్టు నియమించిన సింగిల్ జడ్జి, రిటైర్డ్స్ జస్టిట్ లావు నాగేశ్వరరావు నిషేధం విధించారు. హెచ్‌సీఏను గాడిలో పెట్టేందుకు సుప్రీంకోర్టు సింగిల్ జడ్జి కమిటీని ఏర్పాటు చేసింది. కొన్ని వారాలుగా ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, దాని అనుబంధ క్లబ్స్‌లపై పూర్తి పరిశీలన జరుపుతున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు అనుబంధంగా 206 క్లబ్స్ ఉన్నాయి. వీటి యాజమాన్య హక్కులు కలిగి ఉన్న వాళ్లు వెంటనే తమ ప్రాతినిధ్యాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి అవసరమైన పత్రాలను అందించాలని జస్టిస్ లావు నాగేశ్వరావు మూడు నెలల క్రితం నోటీసులు జారీ చేశారు.

ఈ క్రమంలో మే 30 నుంచి జూన్ 1 మధ్య 207 క్లబ్స్ నుంచి యాజమాన్యపు హక్కులకు సంబంధించి పత్రాలను ఆయా క్లబ్స్ సభ్యులు సమర్పించారు. కాగా, లావు నాగేశ్వరరావు పరిశీలనలో.. ఒకటి కంటే ఎక్కువ క్లబ్స్‌లో చాలా మంది వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యులు ఆఫీస్ బేరర్లుగా, ఎగ్జిక్యూటీవ్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. హెచ్‌సీఏలో సభ్యులుగా ఉన్న వ్యక్తులే ఒకటి కంటే ఎక్కువ క్లబ్స్‌కు యజమానులుగా ఉన్నారు. అంతే కాకుండా సభ్యుల భార్య, పిల్లలు, అతడి బంధువులు లేదా భార్య తరపు బంధువులు క్లబ్స్‌ను నిర్వహిస్తున్నారు. ఇలాంటి 57 క్లబ్స్‌పై ఓటు వేయకుండా నిషేధం విధించారు.

57 క్లబ్స్‌లో నిబంధనలకు విరుద్దంగా ఒకటి కంటే ఎక్కువ క్లబ్స్‌ను సభ్యులు, వారి బంధువులు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని.. వారిపై ఒక ఏడాది లేదంటే గరిష్టంగా మూడేళ్ల పాటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటు వేయకుండా నిషేధం విధిస్తున్నట్లు లావు నాగేశ్వరరావు 46 పేజీల ఉత్తర్వులను జారీచేశారు. అయితే, ఆ 57 క్లబ్స్‌ కేవలం ఓటు వేయకుండా మాత్రమే నిషేధించామని.. ఆయా క్లబ్స్ తరపున ఆడుతున్న క్రికెటర్లు.. హెచ్‌సీఏ నిర్వహించే లీగ్స్, టోర్నీల్లో ఆడవచ్చిన లావు నాగేశ్వరావు పేర్కొన్నారు.

57 క్లబ్స్‌లో జీహెచ్ఎంసీకి చెందిన 18 క్లబ్స్ కూడా ఉన్నాయి. ఇది ప్రభుత్వానికి చెందిన సంస్థ కావడంతో సభ్యులుగా కమిషనర్, ఇతరులు సభ్యులుగా ఉన్నారు. అన్నింటికీ ఒకరే ఉండటంతో వాటిపై కూడా లావు నాగేశ్వరరావు నిషేధం ప్రకటించారు. అయితే, ఈ సమస్య నుంచి బయటపడటానికి జీహెచ్ఎంసీ పరిష్కారాలు వెదుకుతున్నట్లు అధికారులు చెప్పారు.

నిషేధం విధించిన క్లబ్స్..

హైదరాబాద్ టైటాన్స్, విజయానంద్ క్లబ్, విక్టోరియా, హైదరాబాద్ పాట్రియట్స్, హైదరాబాద్ పాంథర్స్, సికింద్రాబాద్ జింఖానా, మయూర, అగర్వాల్ సీనియర్స్, అక్షిత్, జై భగవతి, రిలయన్స్, శ్రీ శ్యామ్, మహ్‌మూద్, సన్‌షైన్, లార్డ్స్, ఎన్‌స్కోన్, హైదరాబాద్ వాండరర్స్, గ్రీన్ టర్ఫ్, ఎవర్ గ్రీన్, సౌత్ ఎండ్, కిషోర్ సన్స్ డిటర్జెంట్, గన్‌రాక్, పికెట్, డెక్కన్ బ్లూస్, హైదరాబాద్ బ్లూస్, రోషనారా, సికింద్రాబాద్ యూనియన్, ఎలిగెంట్, సత్య, క్లాసిక్, న్యూస్టార్స్, స్వస్తిక్, శాంతి అసోసియేట్స్, పి. క్రిష్ణమూర్తి మెమోరియల్, చుమ్స్ ఎలెవెన్, చీర్‌ఫుల్ చుమ్స్, అభినవ్ కోల్ట్స్, దయానంద్, రాజూస్, రాజూస్ క్రికెట్ అకాడమీ, రాజూస్ క్రికెట్ సెంటర్, ఈస్ట్ మారేడ్‌పల్లి, సెయింట్ ఆండ్రూస్, మారేడ్‌పల్లి కోల్ట్స్, కోసరాజు, ఇంటర్నేషనల్, మణికుమార్, ధృవ్ ఎలెవెన్, ఎంఎల్ జయసింహా, ఆంధ్రాబ్యాంక్ కాలనీ, ఫతే మైదాన్, భరత్, అను, క్రౌన్, సెయింట్ సాయి, విసాక, విజయ్‌నగర్ క్లబ్

Tags:    
Advertisement

Similar News