ఆయన ఉదయ్ బాబుమోహన్ కాదు.. ఉదయ్ భాస్కర్ మాత్రమే

తన కొడుకు పేరు ఉదయ్ భాస్కర్ అని, ఉదయ్ బాబుమోహన్ కాదని స్పష్టం చేశారు. తన కొడుకు ఉదయ్ భాస్కర్ రాజకీయాలపై ఆసక్తిగా ఉంటే తానే టికెట్‌ త్యాగం చేసేవాడినని చెప్పారు బాబు మోహన్.

Advertisement
Update:2023-11-25 08:31 IST

తెలంగాణ ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాబు మోహన్ కి కుటుంబం నుంచే సపోర్ట్ లేదని ఆయన ప్రత్యర్థులు సెటైర్లు పేలుస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా బాబు మోహన్ బరిలో నిలిచారు. అయితే ఆయన తనయుడు ఉదయ్ బాబు మోహన్ ఇటీవల బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తండ్రి బీజేపీలో, కొడుకు బీఆర్ఎస్ లో, వారి అనుచరులు డైలమాలో.. ఇలా ఉంది పరిస్థితి. తన కొడుకు బీఆర్ఎస్ లో చేరడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకున్నారు బాబు మోహన్.

ఆందోల్ ప్రచారంలో మీడియాతో మాట్లాడిన బాబు మోహన్ తన కొడుకు పార్టీ మారడంపై స్పందించారు. తనని, తన కొడుకుని విడదీశారని ఆరోపించారు. తన పేరుని కూడా దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. తన కొడుకు పేరు కేవలం ఉదయ్ భాస్కర్ అని, అయితే పార్టీలో చేర్చుకునే క్రమంలో ఆయన్ను ఉదయ్ బాబు మోహన్ గా చేశారని, చివరికి పేరును కూడా మార్చేస్తారా అని ప్రశ్నించారు. తన అనుచరులు, అభిమానుల్లో గందరగోళం సృష్టించేందుకే ఈ పని చేశారన్నారు.

తనను రాజకీయంగా దెబ్బకొట్టేందుకే తన కొడుకుని పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు బాబు మోహన్‌. అంతే కాకుండా తన కొడుకు పేరుని కూడా మార్చేశారని అన్నారు. తన కొడుకు పేరు ఉదయ్ భాస్కర్ అని, ఉదయ్ బాబు మోహన్ కాదని స్పష్టం చేశారు. తన కొడుకు ఉదయ్ భాస్కర్ రాజకీయాలపై ఆసక్తిగా ఉంటే తానే టికెట్‌ త్యాగం చేసేవాడినని చెప్పారు బాబు మోహన్. రాజకీయాల్లో ఆసక్తి లేని తన కొడుకుని ఉద్దేశపూర్వకంగానే తనకు దూరం చేశారని అంటున్నారాయన. 


Tags:    
Advertisement

Similar News