పారాలింపిక్స్ విజేత అథ్లెట్ దీప్తి జీవాంజికి నగదు పురస్కారం అందజేత
తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి రూ.కోటి చెక్కును సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఇటీవల జరిగిన పారాలింపిక్స్‌లో తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజి కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే.
Advertisement
పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి సీఎం రేవంత్ రెడ్డి భారీ నగదు బహుమతి అందించారు. మంగళవారం జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వచ్చిన జీవాంజికి కోటి రూపాయల చెక్ ఇచ్చారు. అంతేకాదు గ్రూప్-2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం కేటాయించారు. కోచ్ కు రూ.10లక్షలు ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి.. భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లాలని దీప్తిని అభినందించారు. ఈ కార్యక్రమంలో శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, క్రీడా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇక చెప్పిన రెండు వారాల్లోనే ముఖ్యమంత్రి చెక్ అందించడంపై దీప్తి, కోచ్ సంతోషం వ్యక్తం చేశారు.
Advertisement