ఆ సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాను..రెజీనా షాకింగ్ కామెంట్స్

ప్రముఖ హీరోయిన్ రెజీనా ఇన్‌స్ట్రాగామ్‌లో తన అభిమానులతో సంచలన విషయాలను షేర్ చేసుకుంది

Advertisement
Update:2024-10-11 15:42 IST

ప్రముఖ హీరోయిన్ రెజీనా ఇటీవల సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసింది. ఈ సందర్బంగా ఓ అభిమాని చేయకూడని పని చేస్తూ తల్లిదండ్రుల వద్ద ఎప్పుడైనా దొరికిపోయారా? అని అడగ్గా.. దీనికి రెజీనా స్పందిస్తూ.. ‘‘ఒకసారి పక్క ఇంట్లో ఏదో జరుగుతుంది. అప్పుడు నేను ఎవరికీ చెప్పకుండా ఏం జరుగుతుందో చూడాలని ఇంటిలోకి తొంగి చూస్తుండగా మా అమ్మకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాను. అప్పుడు అమ్మ తనకి వార్నింగ్ ఇచ్చిందని తెలిపారు. అంతేకాకుండా ఇరుగు పొరుగు ఇళ్లలో జరిగే విషయాల గురించి తెలుసుకోవాలనే ఆలోచన మంచిది కాదని హెచ్చరించింది’’ అని సమాధానమిచ్చింది. ప్రస్తుతం రెజీనా కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. యంగ్ బ్యూటీ రెజీనా కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో 17 ఏళ్లుగా నటించి మంచి పేరు తెచ్చుకుంది.

ఇటీవల ‘ఉత్సవం’ చిత్రంతో అలరించిన రెజీనా.. ప్రస్తుతం తమిళ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న విడాముయర్చిలో కీలక పాత్రలో కనిపించనుంది. అయితే రెజీనా గత కొద్ది రోజులుగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన వ్యక్తిగత విషయాలు వెల్లడిస్తోంది. సినీ ఇండస్ట్రీలో రెజీనా చాలా బోల్డ్‌ నటి అనే చెప్పాలి. సాధారణంగా నటీమణులు వ్యక్తిగత విషయాలను బహిరంగంగా చెప్పుకోవడానిక ఇష్టపడరు. అయితే రెజీనా మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఈమె సినిమా విషయాలనే కాకుండా పర్సనల్ విషయాలను ధైర్యంగా బయటకు చెప్పేస్తారు. ఆ మధ్య తాను చాలా మందితో డేటింగ్‌ చేశాయని చాలా బోల్డ్‌గా చెప్పిన ఈ బ్యూటీ.. తాజాగా మరో వ్యక్తిగత విషయాన్ని బయట పెట్టారు. 

Tags:    
Advertisement

Similar News