వీటిని మీ ఖాతాలోనే వేసుకుంటున్నారా రేవంత్‌

ఏఎంవీఐలకు నియామక పత్రాలపై మాజీ మంత్రి హరీశ్‌ రావు

Advertisement
Update:2024-11-11 17:56 IST

కేసీఆర్‌ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చి, నియామకాల కోసం పరీక్షలు నిర్వహించిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ పోస్టులన్నీ తామే భర్తీ చేసుకుంటున్నామని ప్రచారం చేసుకుంటోందని మాజీ మంత్రి హరీశ్‌ రావు 'ఎక్స్‌' వేదికగా ఎద్దేవా చేశారు. ఈక్రమంలో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను సీఎం రేవంత్‌ రెడ్డి తన ఖాతాలో వేసుకున్నారని అన్నారు. ఆ పోస్టుల భర్తీకి కేసీఆర్‌ 2022 డిసెంబర్‌ 31న నోటిఫికేషన్‌ ఇచ్చారని, 2023 జూన్‌ 28న రాత పరీక్ష నిర్వహించారని గుర్తు చేశారు. నియామకపత్రాలు మాత్రం సోమవారం పంపిణీ చేసి అవి తామే ఇచ్చామని రేవంత్‌ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఉద్యోగ నోటిఫికేషన్‌ తో పాటు రాతపరీక్ష హాల్‌ టికెట్లు డౌన్‌ లోడ్‌ చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ ఇచ్చిన ప్రకటన కాపీలను తన ట్వీట్‌ కు జతచేశారు.

Tags:    
Advertisement

Similar News