వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు మరోసారి నిరసన సెగ
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కు మరోసారి నిరసన సెగ తగిలింది.
వికారాబాద్ జిల్లా తాండూర్ గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్‌లో కలుషిత ఆహారంతో ఆస్పత్రిలో చికిత్సపోందుతున్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలనకు వచ్చారు. దీంతో ఆయన మరోసారి నిరసన సెగ తగిలింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతరేకంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. అనారోగ్యానికి గురైన బాలికలకు ఆసుపత్రిలో చికిత్స అందించాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. తాండూరులోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల హాస్టల్‌లో మంగళవారం ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది.
వసతి గృహంలో మంగళవారం ఉదయం అల్పాహారంలో వడ్డించిన కిచిడి తిన్న తర్వాత 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కడుపులో నొప్పి, వాంతులతో అవస్థ పడ్డారు. మొత్తం 15 మందిలో శ్రావణి, బోలిబాయి, గీత, శైలజ అనే బాలికలకు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారికి ప్రథమ చికిత్స చేసిన వైద్యులు తిరిగి వసతి గృహానికి పంపించారు