ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు

తెలంగాణ వ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. బతుకమ్మ ఉత్సవాల్లో తొలిరోజు అయిన ఎంగిలిపూల బతుకమ్మను తీరొక్క పూలతో పేర్చి మహిళలు, పిల్లలు ఆడిపాడుతున్నారు.

Advertisement
Update:2024-10-02 20:11 IST

తెలంగాణ వ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. బతుకమ్మ ఉత్సవాల్లో తొలిరోజు అయిన ఎంగిలిపూల బతుకమ్మను తీరొక్క పూలతో పేర్చి మహిళలు, పిల్లలు ఆడిపాడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన బతుకమ్మ పండుగ వాతావరణం కనిపిస్తున్నాది. ఈ నేపథ్యంలో తెలంగాణ శిశు, మహిళా సంక్షేమశాఖ మంత్రి సీతక్క హైదరాబాద్‌లో నెక్లెస్ రోడ్ లో గల పీపుల్స్ ప్లాజాలో బతుకమ్మ ఆడారు.

అంతకంటే ముందు అత్యంత భక్తి శ్రద్దలతో ఎంగిలిపూల బతుకమ్మను పేర్చిన సీతక్క, మహిళలందరితో కలసి బతుకమ్మ ఆడిపాడారు. తెలంగాణ ఆడపడుచుల గౌరవానికి బతుకమ్మ ప్రతీక అని, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా బతుకమ్మ సంబురాలు జరపుకొని తెలంగాణ ప్రతిష్టను ఎల్లలు దాటిస్తారని వ్యాఖ్యానించారు. ప్రజా భవన్‌లోని తన నివాసంలో సీతక్క బతుకమ్మను స్వయం పేర్చి తలపై ఎత్తుకొని వచ్చి మహిళలతో కలిసి ఆడారు.

Tags:    
Advertisement

Similar News