అమెరికన్ ఓపెన్ సెమీస్ లో ' ఆ నలుగురు'!

అమెరికన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీస్ లో హాట్ హాట్ ఫైట్ కు రంగం సిద్ధమయ్యింది. పురుషుల డబుల్స్ లో భారత వెటరన్ రోహన్ బొపన్నజోడీ ఫైనల్స్ కు గురిపెట్టింది....

Advertisement
Update:2023-09-07 16:00 IST

అమెరికన్ ఓపెన్ సెమీస్ లో ' ఆ నలుగురు'!

అమెరికన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీస్ లో హాట్ హాట్ ఫైట్ కు రంగం సిద్ధమయ్యింది. పురుషుల డబుల్స్ లో భారత వెటరన్ రోహన్ బొపన్నజోడీ ఫైనల్స్ కు గురిపెట్టింది....

2023 గ్రాండ్ స్లామ్ సీజన్ ఆఖరి టోర్నీ అమెరికన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ కు తొలిసారిగా ఇద్దరు అమెరికన్ ప్లేయర్లు చేరుకొన్నారు. కాగా గత రెండుదశాబ్దాల కాలంలో యూఎస్ ఓపెన్ సెమీస్ చేరిన తొలి అమెరికన్ టీనేజర్ గా 19 సంవత్సరాల కోకో గాఫ్ రికార్డుల్లో చేరింది.

ముచోవాకు గాఫ్ సవాల్...

మహిళల సింగిల్స్ లో ఫైనల్ బెర్త్ కోసం జరిగే తొలి సెమీఫైనల్లో కారోలినా ముచోవాకు టీనేజ్ సంచలనం కోకో గాఫ్ సవాలు విసురుతోంది. వింబుల్డన్ తొలిరౌండ్ ఓటమి తర్వాత నుంచి ఆడిన గత 17 సింగిల్స్ మ్యాచ్ ల్లో 16 విజయాలతో దూకుడుమీదున్న కోకో...తొలిసెమీస్ పోరులో హాట్ ఫేవరెట్ గా నిలిచింది. కోకో దూకుడుకు ముచోవా తట్టుకోగలదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

చెక్ రిపబ్లిక్ కు చెందిన కారోలిన్ ముచోవా 2023 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ సెమీస్ చేరడంతో పాటు..వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్స్ కు సైతం అర్హత సంపాదించింది. ప్రస్తుత అమెరికన్ ఓపెన్ సెమీస్ కు సైతం చేరటం ద్వారా తన సత్తా చాటుకోగలిగింది. 2022 ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ గా నిలిచిన ముచోవా అత్యుత్తమంగా రాణించగలిగితేనే కోకో గాఫ్ ను నిలువరించే అవకాశం ఉంది.

సబలెంకాతో మాడిసన్ కీస్ అమీతుమీ...

రెండోసెమీఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్, ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ విన్నర్ అర్యానా సబలెంకాతో 28 సంవత్సరాల మాడిసన్ కీస్ పోటీపడనుంది.

తన కెరియర్ లో తొలిసారిగా అమెరికన్ ఓపైన్ ఫైనల్స్ చేరాలన్న పట్టుదలతో సబలెంకా ఉంది.

2016 గ్రాండ్ స్లామ్ సీజన్ నాలుగు టోర్నీల సెమీస్ కు సెరెనా విలియమ్స్ చేరిన తరువాత..2023 సీజన్లో అదే ఘనతను సబలెంకా సొంతం చేసుకోగలిగింది.

సెమీఫైనల్లో కోకో గాఫ్, మాడిసన్ కీస్ విజయాలు సాధించగలిగితే...టైటిల్ సమరంలో ఇద్దరు అమెరికన్ ప్లేయర్లు తలపడే అవకాశం ఉంటుంది.

పురుషుల డబుల్స్ ఫైనల్స్ కు రోహన్ జోడీ తహతహ...

భారత డేవిస్ కప్ ఆటగాడు రోహన్ బొపన్న తన పార్ట్నర్ మాథ్యూ ఇబడెన్ తో కలసి అమెరికన్ ఓపెన్ పురుషుల డబుల్స్ ఫైనల్స్ కు గురిపెట్టాడు. 2010లో తొలిసారిగా అమెరికన్ ఓపెన్ డబుల్స్ ఫైనల్స్ చేరిన రోహన్ తిరిగి 13 సంవత్సరాల విరామం తర్వాత చేరుకోవాలని భావిస్తున్నాడు.

సెమీఫైనల్లో ఫ్రెంచ్ జోడీ పియరీ హ్యూజెస్ హెర్బర్ట్- నికోలస్ మహుట్ లతో 6వ సీడ్ రోహన్ బొపన్న- మాథ్యూ ఇబడెన్ జోడీ తలపడనున్నారు.

రెండో సెమీఫైనల్లో 2వ సీడ్ ఇవాన్ డోడిజ్- ఆస్టిన్ క్రైచిక్ ల జోడీతో 3వ సీడ్ రాజీవ్ రామ్- జో సాల్స్ బరీ పోటీపడతారు.

సెమీఫైనల్స్ లో అల్ కరాజ్, మెద్వదేవ్...

పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ కు టాప్ సీడ్ కార్లోస్ అల్ కరాజ్, మాజీ చాంపియన్ డానిల్ మెద్వదేవ్ చేరుకొన్నారు. అల్ కరాజ్ తన క్వార్టర్స్ పోరులో అలవోకగా నెగ్గితే..మెద్వదేవ్ మాత్రం 2 గంటల 47 నిముషాలపాటు పోరాడాల్సి వచ్చింది.

న్యూయార్క్ ఆర్థర్ యాష్ స్టేడియం వేదికగా జరిగిన సెమీస్ పోరులో మాజీ చాంపియన్ మెద్వదేవ్ తన దేశానికే చెందిన ఆండ్రీ రుబులేవ్ ను మూడుసెట్ల పోరులో అధిగమించాడు.

భరించలేని ఉక్కబోత వాతావరణంలో జరిగిన ఈ పోరులో ఇద్దరు ఆటగాళ్లు సుదీర్ఘ ర్యాలీలతో పోరాడి డస్సిపోయారు. మెద్వదేవ్ 6-4, 6-3, 6-4తో విజేతగా నిలవడం ద్వారా తన కెరియర్ లో నాలుగోసారి అమెరికన్ ఓపెన్ సెమీస్ చేరుకోడం విశేషం.

ప్రపంచ నంబర్ వన్ కార్లోస్ అల్ కరాజ్- అలెగ్జాండర్ జ్వెరేవ్ ల సెమీస్ పోరులో నెగ్గిన ఆటగాడితో మెద్వదేవ్ తలపడనున్నాడు.

Tags:    
Advertisement

Similar News