అప్పుడు నాకు గుండెపోటు వచ్చి ఉండేదేమో!

రిటైర్మెంట్‌ ప్రకటన తర్వాత తన ఫోన్‌లో కాల్‌ లిస్ట్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను ఎక్స్‌ లో పంచుకున్న రవిచంద్రన్ అశ్విన్

Advertisement
Update:2024-12-20 15:25 IST

రవిచంద్రన్ అశ్విన్ రెండు రోజుల కిందట అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం విదితమే. భారత్‌ ఎన్నో చిరస్మరణనీయ విజయాలు సాధించడంలో కీలకపాత్ర పోషించిన అతడికి సెలబ్రిటీలు, క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు శుభకాంక్షలు చెబుతున్నారు. అతని భవిష్యత్తు బాగుండాలని సోషల్‌ మీడియా వేదికగా విష్‌ చేస్తున్నారు. దిగ్గజ క్రికెటర్లు సచిన్‌ టెండుల్కర్‌, కపిల్‌ దేవ్‌ నేరుగా ఫోన్‌ చేసి అభినందనలు తెలియజేయడంతో అశ్విన్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తన ఫోన్‌లో కాల్‌ లిస్ట్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను ఎక్స్‌ లో పంచుకున్నాడు.

భారత క్రికెటర్‌ గా కెరీర్‌లో చివరిరోజున నా ఫోన్‌ లో కాల్‌ లిస్ట్‌ ఇలా ఉంటుందని 25 క్రితం ఎవరైనా చెబితే అప్పుడు నాకు గుండెపోటు వచ్చి ఉండేదేమో.. థాంక్స్‌ సచిన్‌ టెండుల్కర్‌, కపిల్‌దేవ్‌ పాజీ అని అశ్విన్‌ రాసుకొచ్చాడు.

మరోవైపు.. అశ్విన్‌కు సరైన విధంగా వీడ్కోలు పలకపోవడంపై కపిల్‌ దేవ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత క్రికెట్‌ దిగ్గజాల్లో ఒకరైన అశ్విన్‌ ఇలా ఆటను వదలడం షాక్‌కు గురి చేసిందన్నాడు. టీమిండియా తరఫున 106 టెస్టులు ఆడి, భారత క్రికెట్‌కు అపారమైన కృషి చేసిన అతడికి బీసీసీఐ ఘనమైన వీడ్కోలు పలకాలని సూచించాడు. ఇక సచిన్‌తో అశ్విన్‌కు మంచి అనుబంధం ఉన్నది. టెస్ట్‌ కెరీర్‌ ప్రారంభంలో టెండుల్కర్‌తో కలిసి మ్యాచ్‌లు ఆడాడు. భారత్‌ 2011 ప్రపంచ కప్‌ సాధించిన జట్టులోనూ అశ్విన్‌ భాగంగా ఉన్నాడు.

Tags:    
Advertisement

Similar News