రెండో వన్డేలోనూ ఓడిన భారత మహిళా జట్టు

భారత్‌పై ఆస్ట్రేలియా 122 రన్స్‌ తేడాతో భారీ విజయం .. సిరీస్‌ ఆసీస్‌దే

Advertisement
Update:2024-12-08 13:42 IST

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత మహిళా జట్టుకు సిరీస్‌ ఓటమి ఎదురైంది. మూడు వన్డేల సిరీస్‌లో బ్రిస్బేన్‌ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా 122 రన్స్‌ తేడాతో భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 371 రన్స్‌ చేసింది. జార్జియా వోల్‌ (101), ఎలీసా పెర్రీ (105) సెంచరీలు సాధించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్‌ 44.5 ఓవర్లలో 249 రన్స్‌కకు ఆలౌటైంది. ఓపెనర్‌ రిచా ఘోష్‌ (54) హాఫ్‌ సెంచరీ సాధించగా.. మిన్ను మని (46), జెమీమా రోడిగ్స్‌ (43), హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (43) రాణించినా టీమిండియా ఓటమి నుంచి తప్పించలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అన్నాబెల్‌ సదర్లాండ్‌ 4, మెగాన్‌ స్కట్‌, కిమ్‌ గార్త్‌, గార్డెనర్‌, అలానా కింగ్‌, సోఫీ తలో వికెట్‌ పడగొట్టారు. మొదటి వన్డేలోనూ ఆసీస్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో వరుస రెండు విజయాలతో ఆస్ట్రేలియా సిరీస్‌ను కైవసం చేసుకున్నది. ఇక నామమాత్రపు చివరి వన్డే డిసెంబర్‌ 11న పెర్త్‌ వేదికగా జరగనున్నది.

Tags:    
Advertisement

Similar News