భారత్- పాక్ క్రికెట్ మ్యాచ్ టికెట్ ధర 33 లక్షలు!

న్యూయార్క్ వేదికగా జూన్ 9న జరిగే భారత్- పాక్ జట్ల మ్యాచ్ టికెట్లు హాటు కేకుల్లా అమ్ముడుపోతున్నట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది.

Advertisement
Update:2024-03-04 15:09 IST

2024 టీ-20 ప్రపంచకప్ లో దాయాదుల సమరం మ్యాచ్ టికెట్లు చుక్కలంటాయి. అభిమానులు టికెట్ల కోసం రికార్ఢుస్థాయిలో డాలర్లు కుమ్మరిస్తున్నారు....

అమెరికా- వెస్టిండీస్ సంయుక్త ఆతిథ్యంలో జరిగే 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ టికెట్ల కోసం రెండుదేశాల అభిమానులు ఎగబడుతున్నారు. మ్యాచ్ టికెట్లు సొంతం చేసుకోడానికి ఎంతైనా చెల్లించడానికి వెనకాడటం లేదు. ప్రీమియం టికెట్ ధర 33 లక్షల రూపాయలంటే ముక్కుమీద వేలేసుకోవాల్సిందే.

33 లక్షల రూపాయలకు చేరిన ప్రీమియం టికెట్ ధర...

న్యూయార్క్ వేదికగా జూన్ 9న జరిగే భారత్- పాక్ జట్ల మ్యాచ్ టికెట్లు హాటు కేకుల్లా అమ్ముడుపోతున్నట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది. భారత ఉపఖండానికి చెందిన ఈ రెండుదేశాల మ్యాచ్ కు మాత్రమే టికెట్ల ధర రికార్డుస్థాయికి చేరడంతో ఐసీసీ ఉక్కిరిబిక్కిరవుతోంది.

రీ-సేల్ మార్కెట్లో మ్యాచ్ టికెట్ల ధర ఆకాశాన్ని అంటింది.

అధికారికంగా కనీస టికెట్ ధరను 6 డాలర్లు ( 497 రూపాయలు), ప్రీమియం టికెట్ల ధరను 400 డాలర్లు ( 33వేల 148 రూపాయలు)గా ఐసీసీ నిర్ణయించింది. అయితే..గతంలోనే ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన వ్యక్తులు తమ టికెట్లను రీసేల్ మార్కెట్లో స్టబ్ హబ్, సీట్ గీక్ వేదికల ద్వారా కళ్లు చెదిరే ధరకు విక్రయించారు.

400 డాలర్ల ధర 40వేల డాలర్లకు ( 33 లక్షల రూపాయల) చేరింది.

ఈ టికెట్ల ధరకు ఫ్లాట్ ఫామ్ ఫీజును కలుపుకొంటే 50 వేల డాలర్లు ( 41 లక్షల రూపాయలు) అవుతుందని రీసేల్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

సూపర్ బౌల్ వేదికగా ' సూపర్ 'ధర !

న్యూయార్క్ లోని విశ్వవిఖ్యాత సూపర్ బౌల్ స్టేడియం వేదికగా గతంలో జరిగిన ఎన్ బిఏ మ్యాచ్ ల సూపర్ బౌల్-58 టికెట్ ధర 9వేల డాలర్లు, కోర్ట్ సైడ్ సీట్ల ధర 24వేల డాలర్లు మాత్రమే కాగా...ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ టికెట్ ధర 40వేల డాలర్లు పలకడాన్ని సరికొత్త రికార్డుగా చెబుతున్నారు.

సీట్ గీక్ వేదికగా ఇప్పటికే 1,75, 000 డాలర్లు ( కోటి 40 లక్షల రూపాయల ) విలువైన టికెట్లు విక్రయించినట్లు అమెరికా టుడే వివరించింది.

ఈ మొత్తానికి ఫ్లాట్ ఫామ్ ఫీజును కలుపుకొంటే కోటి 86 లక్షల రూపాయలు అవుతుందని అధికారికంగా ప్రకటించారు.

ఏదిఏమైనా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ జట్లు తలపడుతున్నాయంటే మాటలా మరి.!

Tags:    
Advertisement

Similar News