వింబుల్డన్ సెమీస్ లో రోహన్ బొపన్నజోడీ!

వింబుల్డన్ లో పాల్గొంటున్న ఏకైక భారత ఆటగాడు రోహన్ బొపన్న డబుల్స్ సెమీస్ చేరడం ద్వారా సంచలనం సృష్టించాడు.

Advertisement
Update:2023-07-13 14:00 IST

వింబుల్డన్ లో పాల్గొంటున్న ఏకైక భారత ఆటగాడు రోహన్ బొపన్న డబుల్స్ సెమీస్ చేరడం ద్వారా సంచలనం సృష్టించాడు.

2023- వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో పాల్గొంటున్న ఒకే ఒక్క భారత ఆటగాడు రోహన్ బొపన్న తన పార్ట్నర్ తో కలసి పురుషుల డబుల్స్ సెమీఫైనల్స్ కు చేరుకొన్నాడు.

ఆస్ట్ర్రేలియాకు చెందిన మాథ్యూ ఇబెడెన్ తో జంటగా పురుషుల డబుల్స్ బరిలో నిలిచిన 43 సంవత్సరాల రోహన్ 6వ సీడ్ గా పోటీపడుతున్నాడు. గంటా 54 నిముషాలపాటు సాగిన పోరులో రోహన్ జోడీ 6-7, 7-5, 6-2తో నెదర్లాండ్స్ కు చెందిన బార్ట్ స్టీవెన్స్- టాలాన్ గ్రీక్స్ పూర్ పై విజయం సాధించడం ద్వారా సెమీస్ కు అర్హత సంపాదించారు.

ఏటీపీ ర్యాంకింగ్స్ ప్రకారం రోహన్ 12, మాథ్యూ 16వ ర్యాంక్ ప్లేయర్లుగా ఉన్నారు. తొలిసెట్ ను 6-7తో టైబ్రేక్ లో కోల్పోయిన రోహన్- మాథ్యూ జోడీ కీలక రెండోసెట్ ను 7-5తో నెగ్గడం ద్వారా 1-1తో సమఉజ్జీలుగా నిలిచారు. నిర్ణయాత్మక ఆఖరి సెట్ ను 6-2తో కైవసం చేసుకోడం ద్వారా టైటిల్ కు రెండు అడుగుల దూరంలో నిలిచారు.

ఫైనల్లో చోటు కోసం జరిగే సెమీస్ లో టాప్ సీడ్ వెస్లీ కూల్ హాఫ్- నీల్ కుప్స్ కీ జోడీతో రోహన్ జోడీ తలపడనున్నారు.

సింగిల్స్ సెమీఫైనల్లో అల్ కరాజ్, మెద్వదేవ్...

పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ కు టాప్ సీడ్ , ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు కార్లోస్ అల్ కరాజ్ తొలిసారిగా చేరుకొన్నాడు. ఆల్ - ఇంగ్లండ్ క్లబ్ సెంటర్ కోర్టు వేదికగా

2 గంటల 21 నిముషాలపాటు సాగిన పోరులో అల్ కరాజ్ 7-6, 6-4, 6-4తో హోల్జెర్ రునీపై విజేతగా నిలిచాడు.

తొలిసెట్ ను 7-6తో టై బ్రేక్ లో నెగ్గిన అల్ కరాజ్..రెండు, మూడు సెట్లలో ప్రతిఘటన ఎదురైనా పదునైన సర్వీస్ తో 6-4, 6-4తో నెగ్గగలిగాడు.

ఫైనల్లో చోటు కోసం జరిగే సెమీస్ పోరులో డేనియెల్ మెద్వదేవ్ తో అల్ కరాజ్ తలపడనున్నాడు.

మరో క్వార్టర్ ఫైనల్ సమరంలో 3వ సీడ్ డేనియెల్ మెద్వదేవ్ 2 గంటల 58 నిముషాలపోరులో 6-4, 1-6, 4-6, 7-6, 6-1తో అమెరికా సంచలనం క్రిస్టోఫర్ యూబ్యాంక్స్ ను ఓడించాడు.

రెండో సెమీఫైనల్స్ లో రెండోసీడ్ నొవాక్ జోకోవిచ్ తో 8వ ర్యాంకర్ జానిక్ సిన్నర్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.

మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ కు ఓన్స్ జెబేర్, అర్యానా సబాలెంకా చేరుకోగా...మాడిసన్ కీస్, ఎలెనా రిబకినాల పోరు క్వార్టర్స్ లోనే ముగిసింది.

Tags:    
Advertisement

Similar News