టీ-20 క్రికెట్ అత్యల్ప స్కోర్లలో మరో ప్రపంచ రికార్డు!

20 ఓవర్లు..60 థ్రిల్సుగా సాగే ధూమ్ ధామ్ టీ-20 ప్రపంచకప్ లో మరో చెత్త రికార్డు వచ్చి చేరింది. కేవలం 10 పరుగులకే కుప్పకూలినజట్టుగా ఐల్ ఆఫ్ మాన్ నిలిచింది.

Advertisement
Update:2023-02-27 10:43 IST

టీ-20 క్రికెట్ అత్యల్ప స్కోర్లలో మరో ప్రపంచ రికార్డు!

20 ఓవర్లు..60 థ్రిల్సుగా సాగే ధూమ్ ధామ్ టీ-20 ప్రపంచకప్ లో మరో చెత్త రికార్డు వచ్చి చేరింది. కేవలం 10 పరుగులకే కుప్పకూలినజట్టుగా ఐల్ ఆఫ్ మాన్ నిలిచింది...

బౌండ్రీల హోరు, సిక్సర్ల హోరు, పరుగుల వెల్లువలా సాగే ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోరుతో మరో ప్రపంచ రికార్డు నమోదయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ విస్తరణ కోసం ఐసీసీ నిర్వహిస్తున్న అనామకజట్ల పోరులో ఈ రికార్డు వచ్చి చేరింది.

స్పెయిన్ లోని లా మాంగా క్లబ్ బాటమ్ గ్రౌండ్ వేదికగా జరిగిన టీ-20 మ్యాచ్ లో ఐల్ ఆఫ్ మాన్ జట్టును స్పెయిన్ 8.4 ఓవర్లలోనే కేవలం 10 పరుగులకే కుప్పకూల్చిన జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

ప్రపంచంలోనే అతిచిన్న ద్వీప దేశంగా ఉన్న ఐల్ ఆఫ్ మాన్ జట్టుకు ఇప్పటి వరకూ 15 అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ లు ఆడిన అనుభవం మాత్రమే ఉంది. స్పెయిన్ తో జరిగిన ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని ఈ పోరులో ఐల్ ఆఫ్ మ్యాన్ బ్యాటర్లలో జోసెఫ్ బుర్రోస్ 7 బంతులు ఎదుర్కొని 4 పరుగులు చేయటం ద్వారా టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఏడుగురు బ్యాటర్లు తమ ఖాతాలు తెరవడంలో విఫలమయ్యారు.

స్పానిష్ బౌలర్లలో అతీఫ్ మహ్మద్ 4 ఓవర్లలో 2 మేడిన్ ఓవర్లతో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

టర్కీ రికార్డు తెరమరుగు...

నాలుగేళ్ల క్రితం చెక్ రిపబ్లిక్ తో జరిగిన అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ లో 21 పరుగులకే కుప్పకూలిన జట్టుగా టర్కీ పేరుతో ప్రపంచ రికార్డు నమోదయ్యింది. అయితే..ఆ అత్యల్ప ప్రపంచ రికార్డు స్కోరును ఐల్ ఆఫ్ మాన్ జట్టు అధిగమించడం ద్వారా చెత్త రికార్డును మూటగట్టుకోవాల్చి వచ్చింది.

స్పెయిన్ జట్టుతోనే ఈ నెల 25న జరిగిన మ్యాచ్ లో సాధించిన 66 పరుగుల స్కోరే ఐల్ ఆఫ్ మాన్ జట్టు అత్యల్పస్కోరుగా ఉంది. ఇప్పటి వరకూ ఐల్ ఆఫ్ మాన్ జట్టు ఆడిన 16 టీ-20 మ్యాచ్ ల్లో 8 విజయాలు, 7 పరాజయాలు రికార్డుతో ఉంది.

సైప్రస్ పైన 3 విజయాలు, ఎస్తోనియాపై 2 విజయాలు, రుమేనియా, సెర్బియా, టర్కీ జట్లపైన ఒక్కో గెలుపు రికార్డు ఐల్ ఆఫ్ మాన్ జట్టుకు ఉంది.

2022-23 బిగ్ బాష్ లీగ్ లో భాగంగా అడిలైడ్ స్ట్ర్రయికర్స్ తో జరిగిన మ్యాచ్ లో సిడ్నీ థండర్ జట్టు 15 పరుగులకే కుప్పకూలింది. అదే ఇంతకుముందు వరకూ అత్యల్ప టీ-20 స్కోరుగా ఉంది.

20 ఓవర్ల మ్యాచ్ లో 501 పరుగులు అత్యధిక స్కోరు కాగా..ఐల్ ఆఫ్ మాన్ సాధించిన 10 పరుగులు అత్యల్పస్కోరుగా రికార్డుల్లో చేరింది.

బ్యాటు, బంతి పట్టుకోడం రాని జట్ల మధ్య అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు నిర్వహిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి అబాసుపాలవుతోంది.

Tags:    
Advertisement

Similar News