అయ్యారే!..వెంకటేశ్ అయ్యర్..!

ఐపీఎల్ -16 లీగ్ లో ఓ చిత్రమైన రికార్డు నమోదయ్యింది. ముంబై వాంఖడే స్టేడియంలో ఈ రికార్డు చోటు చేసుకొంది...

Advertisement
Update:2023-04-17 11:35 IST

అయ్యారే!..వెంకటేశ్ అయ్యర్..!

ఐపీఎల్ -16 లీగ్ లో ఓ చిత్రమైన రికార్డు నమోదయ్యింది. ముంబై వాంఖడే స్టేడియంలో ఈ రికార్డు చోటు చేసుకొంది...

కోల్ కతా నైట్ రైడర్స్...ఐపీఎల్ గత 15 సీజన్ల చరిత్రలో మూడో అత్యంత విజయవంతమైనజట్టు. రెండుసార్లు విజేతగా నిలవడంతో పాటు ఎందరో గొప్ప గొప్ప టీ-20 స్టార్లను వెలుగులోకి తెచ్చిన ఫ్రాంచైజీ.

అయితే..ఐపీఎల్ తొలిసీజన్ ప్రారంభమ్యాచ్ లోనే కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్ బ్రెండన్ మెకల్లమ్ శతకం బాదితే...ఆ తర్వాతి 14 సీజన్లలో మరే కోల్ కతా ఆటగాడు ఐపీఎల్ శతకం నమోదు చేయలేకపోయాడు.

2008లో మెకల్లమ్- 2023లో వెంకటేశ్ అయ్యర్...

2008 ప్రారంభ ఐపీఎల్ లో నాటి కోల్ కతా నైట్ రైడర్స్ ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్ సునామీ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత 2009 నుంచి 2022 వరకూ గత 14 సీజన్లుగా మరే కోల్ కతా ఆటగాడూ మూడంకెల స్కోరు సాధించలేకపోయాడు.

గత 15 సంవత్సరాలుగా సెంచరీ కోసం నిరీక్షిస్తూ వచ్చిన కోల్ కతా కలను ప్రస్తుత సీజన్లో వన్ డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ సాకారం చేశాడు.

49 బంతుల్లోనే మెరుపు శతకం..

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో ముగిసిన పోరులో వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన వెంకటేశ్ అయ్యర్ మెరుపు శతకం సాధించాడు. కేవలం 49 బంతుల్లోనే మూడంకెల స్కోరును చేరుకోగలిగాడు.

అయ్యర్ మొత్తం 51 బంతులు ఎదుర్కొని 104 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. అయ్యర్ రికార్డు శతకంలో 6 బౌండ్రీలు, 9 సిక్సర్లు ఉన్నాయి.

ఐపీఎల్ లో 77వ సెంచరీ...

2008లో ప్రారంభమైన ఐపీఎల్ గత 16 సీజన్ల చరిత్రలో సెంచరీబాదిన రెండో కోల్ కతా బ్యాటర్ గా వెంకటేశ్ అయ్యర్ రికార్డుల్లో చేరాడు. అంతేకాదు..అయ్యర్ శతకం 77వ సెంచరీగా నమోదయ్యింది.

ప్రస్తుత సీజన్లో ఇది కేవలం రెండో సెంచరీ మాత్రమే. కోల్ కతా నైట్ రైడర్స్ తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముగిసిన పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ హ్యారీ బ్రూక్ కచ్చితంగా 100 పరుగులతో ప్రస్తుత సీజన్ తొలి శతకం సాధిస్తే.. ముంబై వాంఖడే స్టేడియంలో కోల్ కతా బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ 105 పరుగులతో రెండో సెంచరీ సాధించగలిగాడు.

పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ హైదరాబాద్ సన్ రైజర్స్ పై సాధించిన 99 పరుగుల నాటౌట్ మూడో అత్యుత్తమ స్కోరుగా ఉంది.

వెంకటేశ్ అయ్యర్ మెరుపు సెంచరీ బాదినా..ముంబై ఇండియన్స్ చేతిలో కోల్ కతా నైట్ రైడర్స్ కు 5 వికెట్ల పరాజయం తప్పలేదు.

Tags:    
Advertisement

Similar News