భారత్‌ 263 రన్స్‌కు ఆలౌట్‌

కివీస్‌ బౌలర్‌ అజాజ్‌కు 5 వికెట్లు.. 28 పరుగుల లీడ్‌లో టీమిండియా

Advertisement
Update:2024-11-02 14:05 IST

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌ తొలి ఇన్సింగ్స్‌లో టీమిండియా 263 రన్స్‌కు ఆలౌటైంది. ప్రభుత్వం భారత్‌ 28 పరుగుల లీడ్‌లో ఉన్నది. శుభ్‌మన్‌ గిల్‌ (90), రిషభ్‌ పంత్‌ (60), వాషింగ్టన్‌ సుందర్‌ (28 నాటౌట్‌) రాణించారు. కివీస్‌ బౌలర్లలో అజాజ్‌ పటేల్‌ 5 వికెట్లు పడగొట్టాడు. పటేల్‌తో పాటు గ్లెన్‌ ఫిలిప్స్‌, ఐష్‌ సోధి, మాట్‌ హెన్నీ చెరో వికెట్‌ తీశారు.అంతకుముందు న్యూజిలాండ్‌ తొలి ఇన్సింగ్స్‌లో 235 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

లంచ్‌ బ్రేక్‌ సమయానికి భారత్‌ 195/5 రన్స్‌ చేసింది. అప్పటికి మరో 40 పరుగులు వెనుకబడి ఉన్నది. అయితే ఆఫ్‌ స్టంప్‌ అవతల పడుతున్న బాల్స్‌కు భారత బ్యాటర్లు పెవిలియన్‌ బాట పట్టారు. అజాజ్‌ తీసిన వికెట్లలో ఇలాంటివే ఎక్కువగా ఉండటం గమనార్హం. స్వీప్‌ షాట్లకు యత్నించకుండా.. బాల్‌ను బ్యాట్‌ మీదికి తెచ్చుకుని క్యాచ్‌లు ఇవ్వడం టీమిండియా బ్యాటర్లు చేసిన తప్పిదమని కామెంటేటర్లు వ్యాఖ్యానించారు. కీలకమైన సమయంలో విరాట్ కోహ్లీ రనౌట్‌ భారత్‌ను దెబ్బతీస్తే.. చివరి వికెట్‌ వచ్చిన ఆకాశ్‌ దీప్‌ కూడా రనౌట్‌తో పెవిలియన్‌కు చేరాడు. మరోవైపు వాషింగ్టన్‌ ఆఖర్లో దూకుడు ఆడుతున్న సమయంలో వికెట్లన్నీ పడిపోయాయి. దీంతో భారత్‌ మరికొంత లీడ్‌ సాధించే అవకాశాన్ని కోల్పోయింది. 

Tags:    
Advertisement

Similar News