రెండో టెస్ట్‌లో టీమిండియా ఘోర పరాజయం

ఆసీస్‌దే పింక్‌బాల్‌ టెస్ట్‌..ఇన్నింగ్స్‌ తేడాతో ఓటమిపాలు కాకుండా బైటపడటమే భారత అభిమానులకు ఊరట

Advertisement
Update:2024-12-08 11:27 IST

బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 19 రన్స్‌ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఆసీస్‌ 3.2 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేధించింది. మెక్‌ స్వినీ (10 నాటౌట్‌), ఖవాజా (9 నాటౌట్‌) రన్స్‌ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 180, ఆస్ట్రేలియా 337 రన్స్‌ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 175 రన్స్‌కు ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే. ఇన్నింగ్స్‌ తేడాతో ఓటమిపాలు కాకుండా బైటపడటమే భారత అభిమానులకు ఊరట కలిగించే అంశం. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో రెండు జట్లు 1-1 తో సమంగా నిలిచాయి. మూడో టెస్టు డిసెంబర్‌ 14న బ్రిస్బేన్‌ వేదికగా ప్రారంభం కానున్నది. 

మొదటి ఇన్నింగ్స్‌లో మిచెల్‌ స్టార్క్‌కు (6/48) వికెట్లు సమర్పించిన భారత బ్యాటర్లు... రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ (5/57) ధాటికి విలవిలాడారు. షార్ట్‌ పిచ్‌ బాల్స్‌కు సరైన షాట్స్‌ కొట్టడంలో విఫలమయ్యారు. ఓవర్‌నైట్‌ 128/5 స్కోర్‌తో మూడోరోజు ఆట ప్రారంభించి కేవలం 47 రన్స్‌ మాత్రమే చేసి మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది. ఇందులో మూడింటిని కమిన్స్‌ తీశాడు. నితీశ్‌కుమార్‌రెడ్డి (42) కొంత పోరాడటంతో భారత్‌కు ఇన్నింగ్స్‌ ఓటమి తప్పింది. రిషభ్‌ పంత్‌ (28), శుభ్‌మన్‌ గిల్‌ (28), యశస్వి జైస్వాల్‌ (24) ఫర్వాలేదనిపించారు. కేఎల్‌ రాహుల్‌ (7), కోహ్లీ (11), రోహిత్‌ (6), అశ్విన్‌ (7) విఫలమై నిరాశపరిచారు. 

Tags:    
Advertisement

Similar News