ఐసీసీ కొత్త క్రికెట్ రూల్స్! ఇకపై అలా కుదరదు!

క్రికెట్‌లో కొన్ని రూల్స్ మారబోతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలోని క్రికెట్‌ కమిటీ చర్చించి కొత్త ప్రతిపాదనలు చేసింది.

Advertisement
Update:2022-09-21 15:56 IST

క్రికెట్‌లో కొన్ని రూల్స్ మారబోతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలోని క్రికెట్‌ కమిటీ చర్చించి కొత్త ప్రతిపాదనలు చేసింది. వాటిని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆమోదించింది. అక్టోబరు ఒకటి నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇంతకీ ఆ రూల్స్ ఏంటంటే..

కొవిడ్ కారణంగా బంతికి ఉమ్మి రాయడంపై ఇప్పటిదాకా తాత్కాలికంగా నిషేధం అమల్లో ఉంది. అయితే ఇప్పుడు దీన్ని శాశ్వతం చేశారు. ఇకపై బంతికి ఉమ్మి రాయడం నిషేధం.

ఇకపై బ్యాటర్‌ క్యాచ్‌ అవుట్‌ అయితే.. స్ట్రైకర్‌ ఉన్న స్థానంలోకే కొత్త బ్యాటర్‌ వస్తాడు. క్యాచ్‌ పట్టే టైంలో బ్యాటర్లు ఒకరినొకరు క్రాస్‌ చేసినా.. పరిగణనలోకి తీసుకోరు.

టెస్టులు, వన్డేల్లో క్రీజులోకి వచ్చే బ్యాటర్‌ రెండు నిమిషాల్లోనే స్ట్రైక్‌ తీసుకునేందుకు రెడీ అవ్వాలి. టైం దాటితే మించితే ఫీల్డింగ్‌ జట్టు టైమౌట్‌ అప్పీల్ చేయొచ్చు. అయితే, టీ20ల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న 90 సెకన్ల వ్యవధిలో ఎలాంటి మార్పు లేదు.

బౌలర్ బంతి వేసే టైంలో నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో బ్యాటర్ క్రీజు దాటితే రనౌట్‌ చేస్తుంటారు కొన్నిసార్లు. దీన్ని 'మన్కడింగ్‌' అంటారు. అయితే దీన్ని అన్‌ఫెయిర్‌ప్లే సెక్షన్‌ నుంచి రెగ్యులర్‌ రనౌట్‌ సెక్షన్‌కు మార్చారు.

బౌలర్‌ బంతి వేయకముందే.. బ్యాటర్‌ క్రీజ్ బయటకు వచ్చి ఆడేందుకు ప్రయత్నిస్తే.. బౌలర్‌ బంతిని విసిరి, రనౌట్‌ చేయకూడదు. అలా చేస్తే దాన్ని డెడ్‌ బాల్‌గా ప్రకటిస్తారు.

బంతిని ఆడేటప్పుడు బ్యాటర్‌ బ్యాట్‌లో కొంత భాగం లేదా అతని శరీరం పిచ్‌పైనే ఉండాలి. అలా కాకుండా పిచ్‌ బయటకు వచ్చి ఆడితే.. దాన్ని డెడ్‌ బాల్‌గా పరిగణిస్తారు.

టీ20 క్రికెట్‌లో అమల్లో ఉన్న స్లో ఓవర్‌ రేట్‌ ఇప్పుడు వన్డేల్లో కూడా అమలు అవుతుంది. నిర్ణీత సమయంలో బౌలింగ్‌ జట్టు ఓవర్లను పూర్తి చేయలేకపోతే.. ఆ మిగిలిన ఓవర్లలో ఓ ఫీల్డర్‌ను బౌండరీ దగ్గర నుంచి 30 యార్డ్‌ సర్కిల్‌లోకి తీసుకురావాల్సి ఉంటుంది.

బౌలర్‌ బంతి వేయడానికి రనప్‌ అందుకొన్న టైంలో.. ఫీల్డింగ్‌లో ఏదైనా ఉద్దేశపూర్వకమైన, అనైతిక కదలికలు చోటు చేసుకుంటే అంపైర్‌ ఆ బంతిని డెడ్‌ బాల్‌గా ప్రకటించొచ్చు. అలాగే బ్యాటింగ్‌ జట్టుకు పెనాల్టీ రూపంలో 5 పరుగులు ఇవ్వొచ్చు.

Tags:    
Advertisement

Similar News