హిట్ మ్యాన్ సిక్స్‌ల వరద.. 600 సిక్స్‌లతో వరల్డ్ రికార్డ్
ప్రస్తుతం రోహిత్‌తోపాటు క్రికెట్ ఆడుతున్నవారిలో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 330 సిక్సులు కొట్టాడు. అత్యధిక సిక్సుల జాబితాలో అతని స్థానం 9. డేవిడ్ వార్నర్ 312 సిక్సులతో 11వ స్థానంలో, 294 సిక్సులతో మన కోహ్లీ 12వ స్థానంలో ఉన్నాడు.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన తొలిమ్యాచ్‌లో అర్ధ సెంచరీ పూర్తిచేసిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును కూడా దాటాడు. ఈ మ్యాచ్‌లో 3 సిక్సులు కొట్టిన రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌లో 600 సిక్సుల మైలురాయిని చేరుకున్నారు. ఇది ప్రపంచ రికార్డు. ప్రస్తుత క్రికెటర్లలో ఎవరూ దరిదాపుల్లోకి కూడా రాలేనంత సిక్సుల రికార్డు ఇప్పుడు రోహిత్ శర్మ పేరిటే ఉంది.
తర్వాత వాళ్లంతా రిటైరయ్యారు
నిన్నటి 3 సిక్సులతో అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్‌శర్మ 600 సిక్సులు బాదిన తొలి ఆటగాడయ్యాడు. తర్వాత స్థానాల్లో విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (553), పాక్ మాజీ స్టార్ షాహిద్ ఆఫ్రిది (476), న్యూజిలాండ్ ఆటగాళ్లు బ్రెండన్ మెకల్లమ్ (398), మార్టిన్ గఫ్తిల్ (383) ఉన్నారు. ఈ టాప్5లో రోహిత్ ఒక్కడే ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్నాడు. మిగిలినవారంతా రిటైర్ అయిపోయారు.
ఇప్పుడున్నవాళ్లెవరూ దరిదాపుల్లోకి కూడా రాలేరు
ప్రస్తుతం రోహిత్‌తోపాటు క్రికెట్ ఆడుతున్నవారిలో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 330 సిక్సులు కొట్టాడు. అత్యధిక సిక్సుల జాబితాలో అతని స్థానం 9. డేవిడ్ వార్నర్ 312 సిక్సులతో 11వ స్థానంలో, 294 సిక్సులతో మన కోహ్లీ 12వ స్థానంలో ఉన్నాడు. రోహిత్ కొట్టిన 600 సిక్సుల రికార్డును వీరు అందుకోవడం అసాధ్యం.
ఆల్‌టైమ్ రికార్డుగా మిగిలిపోతుందా?
ఇప్పుడు వస్తున్న ఆటగాళ్లకు ఫిట్‌నెస్ ఉండట్లేదు. 100 మ్యాచ్‌లు నిలకడగా ఆడే ఆటగాళ్లెవరూ కనపడటం లేదు. ఫిట్‌నెస్ బాగున్నా ఫామ్ లేకపోతే ఆ ప్లేస్ అందుకోవడానికి రిజర్వ్ బెంచ్‌మీద పదుల కొద్దీ ఆటగాళ్లు రెడీగా ఉంటున్నారు. మ్యాచ్‌కు యావరేజ్‌న ఓ 3 సిక్సులు కొట్టినా, కనీసం 200 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలి. అంత ఫిట్నెస్, అంతకాలం జట్టులో కొనసాగే ఆటగాళ్లు ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో చాలా అరుదుగానే కనిపిస్తున్నారు. కాబట్టి రో`హిట్` మ్యాన్ సిక్సుల రికార్డు ఆల్‌టైమ్ గ్రేట్‌గా మిగిలిపోయినా ఆశ్చర్యం లేదు.