ప్రపంచకప్ ' పవర్ ప్లే'లో కంగారూజోడీ పవర్!

వన్డే ప్రపంచకప్ చరిత్రలో కంగారూ జోడీ డేవిడ్ వార్నర్- ట్రావిస్ హెడ్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. న్యూజిలాండ్ పై తమజట్టు 5 పరుగుల విజయం సాధించడంలో ప్రధానపాత్ర వహించారు.

Advertisement
Update:2023-10-29 12:05 IST

ప్రపంచకప్ ' పవర్ ప్లే'లో కంగారూజోడీ పవర్!

వన్డే ప్రపంచకప్ చరిత్రలో కంగారూ జోడీ డేవిడ్ వార్నర్- ట్రావిస్ హెడ్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. న్యూజిలాండ్ పై తమజట్టు 5 పరుగుల విజయం సాధించడంలో ప్రధానపాత్ర వహించారు...

వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే ఐదుసార్లు విజేత ఆస్ట్ర్రేలియా పరాజయాలను అధిగమించి గెలుపుబాట పట్టింది. 2023 ప్రపంచకప్ టోర్నీ రౌండ్ రాబిన్ లీగ్ 6వ రౌండ్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి న్యూజిలాండ్ తో జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్లో 5 పరుగులతో సంచలన విజయం సాధించడం ద్వారా పుంజుకొంది.

అంతేకాదు..48 సంవత్సరాల వన్డే ప్రపంచకప్ చరిత్రలో 100వ మ్యాచ్ ఆడిన తొలిజట్టు ఘనతను ఆస్ట్ర్రేలియా దక్కించుకొంది.

175 పరుగుల రికార్డు భాగస్వామ్యం....

ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన 6వ రౌండ్ పోరులో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్ర్రేలియాకు ఓపెనింగ్ జోడీ డేవిడ్ వార్నర్- ట్రావిస్ హెడ్ 175 పరుగులతో రికార్డు భాగస్వామ్యం అందించారు.

గత ఎనిమిదిసంవత్సరాలుగా న్యూజిలాండ్ పేరుతో ఉన్న పవర్ ప్లే ఓవర్లలో అత్యధిక పరుగుల రికార్డును తెరమరుగు చేశారు.

పవర్ ప్లే ఓవర్లలో బాదుడే బాదుడు...

ఇన్నింగ్స్ మొదటి 10 (పవర్ ప్లే ) ఓవర్లలోనే కంగారూ జోడీ చెలరేగిపోయారు. కేవలం 60 బంతుల్లోనే 118 పరుగుల భాగస్వామ్యంతో సరికొత్త రికార్డు నమోదు చేశారు.

2015 ప్రపంచకప్ లో భాగంగా వెలింగ్టన్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ నెలకొల్పిన 2 వికెట్లకు 116 పరుగుల భాగస్వామ్యం రికార్డును ఆస్ట్ర్రేలియాజోడీ అధిగమించగలిగారు. 2015లో న్యూజిలాండ్ బ్యాటర్ బ్రెండన్ మెకల్లమ్ 25 బంతుల్లోనే 77 పరుగులు సాధించడంతో పవర్ ప్లే 10 ఓవర్లలో న్యూజిలాండ్ 116 పరుగుల రికార్డు స్కోరు సాధించగలిగింది. గత ఎనిమిదేళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఆ రికార్డును అధిగమించడానికి 2023 ప్రపంచకప్ వరకూ వేచిచూడాల్సి వచ్చింది.

ప్రస్తుత ప్రపంచకప్ లో ఆస్ట్ర్రేలియా తరువాత భారత్, శ్రీలంకజట్లు మాత్రమే పవర్ ప్లే ఓవర్లలో అత్యుత్తమ భాగస్వామ్యాలు నమోదు చేయగలిగాయి.

అప్ఘనిస్థాన్ పైన భారత్ మొదటి 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 94 పరుగులు, దక్షిణాఫ్రికా పై శ్రీలంక 2 వికెట్లకు 94 పరుగుల భాగస్వామ్యాలు సాధించాయి.

2011 ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా భారత్ పవర్ ప్లే ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 87 పరుగుల రికార్డు సాధించింది. ఆ రికార్డును ప్రస్తుత ప్రపంచకప్ లో భారత్ సవరించుకోగలిగింది.

ట్రావిస్ హెడ్ రికార్డు సెంచరీ...

ఆస్ట్ర్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ప్రపంచకప్ లో తన అరంగేట్రం మ్యాచ్ లోనే శతకం బాదిన బ్యాటర్ గా నిలిచాడు. సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తో జంటగా మొదటి వికెట్ కు 175 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశాడు.

వార్నర్ 65 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగులు సాధించగా..ట్రావిస్ హెడ్ 67 బంతు్ల్లోనే 10 ఫోర్లు, 7 సిక్సర్లతో 109 పరుగులు సాధించాడు. ప్రస్తుత ప్రపంచకప్ లో అరంగేట్రం మ్యాచ్ లోనే శతకం బాదిన రెండో బ్యాటర్ గా నిలిచాడు. న్యూజిలాండ్ వన్ డౌన్ ఆటగాడు రచిన్ రవీంద్ర సైతం అరంగేట్రం మ్యాచ్ లోనే సెంచరీ నమోదు చేయగలిగాడు.

నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఆస్ట్ర్రేలియా- న్యూజిలాండ్ జట్ల పోరులో రచిన్ రవీంద్ర సెంచరీ, జిమ్మీ నీషమ్ హాఫ్ సెంచరీ సాధించినా కివీజట్టుకు 5 పరుగుల పరాజయం తప్పలేదు.

గత ప్రపంచకప్ రన్నర్ న్యూజిలాండ్ కు గత రెండురౌండ్లలో ఇది రెండో ఓటమి. ధర్మశాల వేదికగా ఆడిన రెండుకు రెండుమ్యాచ్ ల్లోనూ కివీజట్టు పరాజయాలు పొందటం విశేషం.

మొత్తం 6 రౌండ్లలో 4 విజయాలు, 2 పరాజయాల రికార్డుతో ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News