టెస్టుల్లో ఇక విరాట్ ప్రభావ' హీనమే' నా?

సాంప్రదాయటెస్టు క్రికెట్లో విరాట్ ప్రభావం అంతంత మాత్రమేనని క్రికెట్ పండితులు చెబుతున్నారు.

Advertisement
Update:2023-07-10 12:23 IST

విరాట్ కొహ్లీ

సాంప్రదాయటెస్టు క్రికెట్లో విరాట్ ప్రభావం అంతంత మాత్రమేనని క్రికెట్ పండితులు చెబుతున్నారు. ప్రపంచ మేటి బ్యాటర్ల జాబితా నుంచి విరాట్ ను తొలగించాల్సిన సమయం వచ్చిందని అంటున్నారు....

విరాట్ కొహ్లీ..గత పుష్కరకాలంగా క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటుకొంటూ వస్తున్న ఆటగాడు. అయితే..గత మూడేళ్లుగా సాంప్రదాయ టెస్టు క్రికెట్లో విరాట్

ప్రభావం అంతంత మాత్రమేనని, భారత బ్యాటింగ్ ఆర్డర్లో విరాట్ అలంకరణగా మిగిలిపోయాడంటూ క్రికెట్ విమర్శకులు చెబుతున్నారు.

' ఫ్యాబ్-4 ' నుంచి విరాట్ అవుట్...

టెస్టు క్రికెట్ ప్రస్తుత సమకాలీన బ్యాటర్లలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్, ఆస్ట్ర్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్ తో పాటు..

భారత మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీలను ' ఫ్యాబ్-4 'గా పరిగణించేవారు. అయితే..మిగిలిన ముగ్గురూ తమతమ జట్ల తరపున నిలకడగా, అమోఘంగా రాణిస్తుంటే..

విరాట్ కొహ్లీ మాత్రం స్థాయికి తగ్గట్టుగా రాణించలేక బ్యాటింగ్ ఆర్డర్ కే అలంకరణగా మిగిలాడని క్రికెట్ వ్యాఖ్యాత, భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా తేల్చి చెప్పాడు.

టెస్టు క్రికెట్లో విరాట్ కొహ్లీ అంటే ప్రత్యర్థిజట్లు భయపడే రోజులు పోయాయని, విరాట్ ప్రభావహీనంగా మారాడని చెప్పాడు. దానికి విరాట్ ఆటతీరు, గణాంకాలే నిదర్శనమని వివరించారు.

2020 నుంచి విరాట్ వెలవెల...

2019 సీజన్ వరకూ ప్రత్యర్థి జట్ల గుండెల్లో రైళ్లు పరుగుగెత్తించిన విరాట్ ..ఆ తర్వాత రెండేళ్లపాటు శతకం సాధించడానికి ఎదురుచూడాల్సి వచ్చింది. టెస్టు మ్యాచ్ ల్లో వరుస వైఫల్యాలతో జట్టుకే భారంగా మారినా.. టీమ్ మేనేజ్ మెంట్ భరిస్తూ వచ్చింది.

2014 నుంచి 2019 మధ్యకాలంలో స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్స్ సన్, జో రూట్ లతో కలసి విరాట్ కొహ్లీ సెంచరీల మోత మోగించాడు. టెస్టు క్రికెట్ ను అత్యున్నత ప్రమాణాలతో కొత్తపుంతలు తొక్కించాడు. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన డే-నైట్ టెస్టులో తన దైనశైలిలో శతకం బాదిన విరాట్..ఆ తర్వాత నుంచి మూడంకెల స్కోరు కోసం 30 మాసాలకు పైగా ఎదురుచూడాల్సి వచ్చింది.

2014 నుంచి 2019 వరకూ 62 టెస్టులు ఆడిన విరాట్ 22 సెంచరీలతో సహా 5వేల 695 పరుగులతో పాటు 58.71 సగటు నమోదు చేశాడు. స్వదేశీగడ్డపై జరిగిన సిరీస్ ల్లో ఏకంగా నాలుగు డబుల్ సెంచరీలు బాదాడు.

25 టెస్టుల్లో ఒక్కటే శతకం...

2020 తర్వాత నుంచి 25 టెస్టులు ఆడిన విరాట్ ఒకే ఒక్క శతకంతో 1277 పరుగులు మాత్రమే సాధించగలిగాడు. సగటు సైతం 58.71 నుంచి 29.69కి పడిపోయింది.

అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్ర్రేలియాతో జరిగిన టెస్టుమ్యాచ్ లో విరాట్ కొహ్లీ తన చివరి శతకం సాధించాడు.

2011 జూన్ 20న తొలి తొలిటెస్టుమ్యాచ్ ను వెస్టిండీస్ పర్యటనలో భాగంగా జమైకాలోని కింగ్స్ టన్ వేదికగా ఆడిన విరాట్ గత 12 సంవత్సరాల కాలంలో 109 టెస్టులు ఆడి 8వేల 479 పరుగులు సాధించాడు. 48.72 సగటుతో 28 శతకాలు, 28 అర్ధశతకాలు సాధించాడు. డజన్ల కొద్దీ రికార్డులు సైతం నమోదు చేశాడు.

అయితే...గత మూడేళ్లుగా విరాట్ వెలవెల బోతూ వస్తున్నాడు. ప్రధానంగా టెస్టుమ్యాచ్ ల్లో విరాట్ బ్యాటింగ్ లో వాడీవేడి తగ్గిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే..

భారత బ్యాటింగ్ ఆర్డర్లో కాగితం పులిగా మారిపోయాడు.

వెస్టిండీస్ తో మంగళవారం ప్రారంభమయ్యే రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో విరాట్ స్థాయికి తగ్గట్టుగా రాణించితీరక తప్పదు. విఫలమైతే టెస్టుజట్టులో స్థానం కోల్పోయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.

Tags:    
Advertisement

Similar News